ప్రస్తుతం కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంతో ఎన్నో జంటలు వివాహాలకు సిద్ధమవుతున్నాయి. గత ఏప్రిల్ నెలలో పలు జంటలు పెళ్లిళ్లు చేసుకోగా మే నెల వైశాఖ మాసం కాబట్టి బలమైన ముహూర్తాలు చాలానే ఉన్నాయి. మే, జూన్, నెలల్లో తెలుగు రాష్ట్రాలలో సుమారు 50 వేల జంటలు ఒక్కటి కానున్నాయి. మే నెలలో 4, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 20, 21, 22, 23, 25, తేదీలు పెళ్లిళ్లకు మంచి రోజులు.