healthy oats: తొందరగా బరువు తగ్గాలంటే ఓట్స్ ను ఇలా తీసుకోండి..

Published : May 02, 2022, 04:54 PM IST

healthy oats: పోషకాహారాల్లో ఓట్స్ ఒకటి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా ఓట్స్ ను తింటే అధిక బరువు నుంచి ఈజీగా బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

PREV
16
healthy oats: తొందరగా బరువు తగ్గాలంటే ఓట్స్ ను ఇలా తీసుకోండి..

ఓట్స్ లో ఫైబర్, పిండి పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఓవర్ వెయిట్ తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి. ఒకవేళ మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే మీ రోజు వారి ఆహారంలో ఓట్స్ ను చేర్చండి. అలా అని ఫ్లేవర్డ్, ప్యాక్డ్ ఓట్స్ ను మాత్రం అస్సలు తీసుకోకూడదు. వీటిని తింటే మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. 
 

26

సాధారణ ఓట్స్ ను తీసుకుంటేనే మీరు వెయిట్ లాస్ అవుతారు. అందులోనూ ఈ ఓట్స్ ను ఈ నాలుగు పద్దతుల్లో తీసుకుంటే మరింత ఫాస్ట్ గా అధిక బరువు ను తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

36

స్నాక్స్ గా.. ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటూనే స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆకలిని తగ్గించేందుకు ఓట్స్ బాగా ఉపయోగపడతాయి. అందుకే మీరు చిరుతిళ్లకు బదులుగా ఓట్స్ ను తీసుకోండి. ఈజీగా మీ బరువు నియంత్రణలో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తో ఓట్స్ చివ్డాను తయారుచేసుకుని తింటే చక్కటి ఫలితం ఉంటుంది. 

46

స్వీట్ ఓట్స్.. తీపి పదార్థాలతో బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ నేచురల్ షుగర్స్ తీసుకుంటే బరువు పెరిగే అవకాశం మాత్రం ఉండదు. అందుకు ఓట్స్ లో నేచురల్ షుగర్స్ ను కలిపి తీసుకోవచ్చు. అంటే ఓట్స్ లో బ్లాక్ బెర్రీలు, బ్లూబెర్రీలు, డ్రై ఫ్రూట్స్ ను మిక్స్ చేసి తీసుకోవచ్చు. 

56

ఓట్స్ వాటర్.. చాలా మంది పాలలో ఓట్స్ ను మిక్స్ చేసి తింటూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ ను పాలలో కాకుండా నీటిలో ఉడికించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 

66

ఓట్స్ ఉప్మా.. ఓట్స్ తో ఉప్మాను చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. దీన్ని వండటం చాలు సులువు కూడా. ఈ ఉప్మాను వివిధ కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. ఓట్స్ ను ఇలా తయారుచేసుకుని తినడం వల్ల మీ శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్లు అందుతాయి. అలాగే ఫైబర్ కూడా అందుతుంది.  


 

click me!

Recommended Stories