కొలెస్ట్రాల్ స్థాయిల్ని అదుపులో ఉంచే అద్భుత పానీయాలు.. చూడండి..

First Published Sep 6, 2021, 1:49 PM IST

చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. అందుకే ఈ కొలెస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ ఉంచడానికి ఆహారంలో ఫైబర్ శాతం పెంచడం, సంతృప్త కొవ్వులను తగ్గించడం, శాకాహారాన్ని పెంచడం, రిఫైన్డ్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉండడం... ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్లను తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

రక్తం, శరీర కణాలలో ఉండే కొవ్వు లాంటి పదార్థాన్నే కొలెస్ట్రాల్ అంటారు. కణాలు, కణజాలాలు, అవయవాల తయారీకి కొలెస్ట్రాల్ కీలకంగా పనిచేస్తుంది. హార్మోన్లు, విటమిన్ డి, పిత్త రసాల తయారీలోనూ ఉపయోగపడతాయి. ఈ కొలెస్ట్రాల్ లో గుడ్ కొలెస్ట్రాల్ (HDL), బాడ్ కొలెస్ట్రాల్ (LDL), గ్లిసరైడ్స్ అని ఉంటాయి. 

చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. అందుకే ఈ కొలెస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ ఉంచడానికి ఆహారంలో ఫైబర్ శాతం పెంచడం, సంతృప్త కొవ్వులను తగ్గించడం, శాకాహారాన్ని పెంచడం, రిఫైన్డ్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉండడం... ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్లను తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చు. 

తాజా అధ్యయనాల ప్రకారం పట్టణ జనాభాలో 25-30%, గ్రామీణ జనాభాలో  15-20% మందిలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు తేలింది. అందుకే పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. దీనికోసం కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ లో పెట్టే కొన్ని రకాల పానీయాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

గ్రీన్ టీ : యాంటీఆక్సిడెంట్లకు అద్బుతమైన సోర్స్ గ్రీన్ టీ. ఇందులో కాటెచిన్స్, ఎపిగలోకాటెచిన్ గ్యాలెట్‌లు ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వలన చెడు కొలెస్టరాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని మొత్తం కొలెస్టరాల్ స్థాయిల్లోనూ తగ్గుదల కనిపిస్తుంది.  

టొమాటో రసం : టమోటాలో మంచి మొత్తంలో లైకోపీన్ ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్, కణాల నష్టాన్ని కాపాడుతుంది. టమోటాల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టమాటాలను ప్రాసెస్ చేయడం వలన వాటిలోని లైకోపీన్ కంటెంట్ పెరగడానికి సహాయపడుతుంది.

ఇందులో నియాసిన్ & కొలెస్ట్రాల్ తగ్గించే ఫైబర్స్ కూడా ఉన్నాయి. 2 నెలల పాటు రోజుకు 280ఎంఎల్ టమాటారసం తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనం తెలిపింది.

సోయా పాలు : సోయా పాలలో తక్కువ స్థాయి సంతృప్త కొవ్వులు ఉంటాయి. రెగ్యులర్ క్రీమర్లు, అధిక కొవ్వు ఉన్న పాలను సోయా పాలతో భర్తీ చేయడం వల్ల కొలెస్ట్రాల్ నిర్వహణలో సహాయపడుతుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ప్రతిరోజూ ఆహారంలో భాగంగా సంతృప్త కొవ్వులు, 25 గ్రాముల సోయా ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహారాన్ని సిఫార్సు చేస్తుంది.

వోట్ డ్రింక్స్ : కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వోట్ పాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది బీటా-గ్లూకాన్స్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది. పిత్త లవణాలతో సంకర్షణ చెందుతుంది. ప్రేగులలో జెల్ లాంటి పొరను సృష్టిస్తుంది, కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు వోట్ పాలు 1.3 గ్రాముల బీటా గ్లూకాన్‌ను అందిస్తుంది. వోట్ డ్రింక్స్ ను కొంటున్నప్పుడు తప్పనిసరిగా వాటి డబ్బాలమీద బీటా-గ్లూకాన్‌లు ఉన్నాయా? లేదా? చెక్ చేసి వెతకండి. 

బెర్రీ స్మూతీస్ : బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి అనేక బెర్రీలు యాంటీఆక్సిడెంట్‌లు, ఫైబర్‌లతో నిండి ఉంటాయి. లో ఫ్యాట్ పాలతో, బెర్రీలు కలిపి మిల్క్ షేక్ చేసి తాగితే.. కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా  తగ్గుతాయి.

కోకో పానీయాలు : కోకోలో ఫ్లేవనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది, ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడే అధిక స్థాయి మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న డార్క్ చాక్లెట్‌లో కనిపించే ప్రధాన పదార్ధం కోకో. ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచే ఫ్లేవనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. సాధారణంగా, రోజుకు రెండుసార్లు 450ఎంజీ కోకో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రాసెస్ చేయబడిన చాక్లెట్లు అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులను కలిగి ఉన్నందున వాటిని నివారించాలి.

ఆల్కహాల్ : మితమైన మద్యపానం రక్తంలో మంచి కొవ్వుల స్థాయిలను పెంచుతుంది. రెడ్ వైన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నందున ఆల్కహాల్ తీసుకోవచ్చు. రెడ్ వైన్‌ తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా కొన్ని గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అందుకే మహిళలు రోజుకు ఒక గ్లాస్, మగవారికి రోజుకు రెండు గ్లాసులు మోతాదు సరిపోతుంది. 

ప్లాంట్ బేస్డ్ స్మూతీలు : కాలే, గుమ్మడి, పుచ్చకాయలు, అరటి పండ్లతో తయారు చేసిన స్మూతీలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. స్మూతీస్ చేయడానికి ఓట్ మిల్క్‌లో ఈ పదార్థాలను కలపడం వల్ల క్రమరహిత కొలెస్ట్రాల్ స్థాయిలకు కారణమయ్యే తక్కువ సంతృప్త కొవ్వులు ఉండేలా చేస్తుంది.

 స్టానాల్స్ అండ్ స్టెరాల్స్ కలిగిన డ్రింక్స్ : స్టెరాల్స్ అండ్ స్టానాల్‌లు కొలెస్ట్రాల్ శోషణను నిరోధించే కొలెస్ట్రాల్ ఆకారం, పరిమాణంలో ఉండే మొక్కల రసాయనాలు. ఆహార కంపెనీలు ఈ రసాయనాలను అనేక ఆహారాలు, పానీయాలకు జోడిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి రోజుకు 1.3 గ్రాముల స్టెరాల్, 3.4 గ్రాముల స్టానాల్ సహాయపడుతుందని FDA పేర్కొంది.

click me!