
Government Schemes for Youth : ప్రస్తుతం చదువు పూర్తిచేసి డిగ్రీలు చేతబట్టుకుని తిరిగినా చాలామందికి ఉద్యోగాలు రావడంలేదు. దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రోజురోజుకు పెరుగుతోంది... ఇందుకు అనేక కారణాలున్నాయి. అందుకే యువతను ఉద్యోగాలకు అనువుగా తీర్చిందిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోంది. ఈ బడ్జెట్ 2026 లో ఈ పథకాలకు నిధులు దక్కే అవకాశాలున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగితను తగ్గించేందుకు అమలుచేస్తున్న పథకాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ పథకం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. ఐటీతో పాటు సేవా, పారిశ్రామిక రంగాల్లో అవసరమైన ప్రాక్టికల్ శిక్షణను అందిస్తారు. తద్వారా పెద్దపెద్ద డిగ్రీలు లేకున్నా స్కిల్స్ ఆధారంగా మంచి ఉద్యోగాలను పొందవచ్చు... అందుకే నైపుణ్య శిక్షణపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పిఎంకెవివై పథకం కింద శిక్షణపొందిన యువతకు ఉద్యోగాలు పొందారు... జీవితంలో సెటిల్ అయ్యారు. ఈ పథకం కింద మెరుగైన స్కిల్స్ పొంది మీరు కూడా ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.
ఈ పథకం కింద యువతకు కంపెనీల్లో తాత్కాలికంగా పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఇలా చదువు పూర్తవగానే యువతకు పని అనుభవం లభిస్తుంది. అప్రెంటిస్‌గా పనిచేసిన యువతకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి అనుభవం లేదనే కారణంతో ఉద్యోగాలు పొందలేకపోతున్న యువతకు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహక పథకం గొప్పవరం అనే చెప్పాలి.
ఇదికూడా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే పథకం. ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు అనుకూలంగా విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ చేస్తారు. తద్వారా యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఇది ఉద్యోగుల కోసం వెతుకుతున్న కంపెనీలను... ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగ యువతను అనుసంధానం చేసే డిజిటల్ ప్లాట్ ఫార్మ్. ఇందులో ఉద్యోగ ఖాళీల వివరాలను పొందుపరుస్తారు. అలాగే కెరీర్ ను ఎలా మెరుగుపర్చుకోవాలి, స్కిల్ మ్యాచింగ్ వంటి సేవలను కూడా అందిస్తారు. తద్వారా యువత తమకు సరైన ఉద్యోగాలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ రోజ్ గార్ మేళాలను నిర్వహించింది. ఇదే నిరుద్యోగ యువతకు నేరుగా ఉద్యోగాలను అందించేందుకు అమలుచేస్తున్న అద్బుత పథకం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఖాళీలకు భర్తీ చేసేందుకు ఈ రోజ్ గార్ మేళాలు ఉపయోగపడుతున్నాయి.
చదువు పూర్తయ్యాక నేరుగా ఉద్యోగాలు లభించడం చాలా కష్టం. అందుకే ముందుగా పరిశ్రమల్లో పనిచేసిన అనుభవాన్ని యువతకు కల్పించేందుకు కేంద్రం ఈ పథకం అమలుచేస్తోంది. ఇంటర్న్‌షిప్ చేయడంద్వారా యువతీయువకులు పని వాతావరణాన్ని అర్థం చేసుకోవచ్చు... తద్వారా భవిష్యత్ లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించేందుకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. దీని వల్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకువస్తాయి... దీంతో స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇలా పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలను పెంచడమే ఉద్యోగ కల్పన ప్రోత్సాహక ప్యాకేజీ ముఖ్య ఉద్దేశం.
కేంద్ర ప్రభుత్వం యువత కోసం ఇలాంటి ఇంకొన్ని పథకాలను కూడా అమలుచేస్తోంది. నైపుణ్యాల లేమి, పని అనుభవం లేకపోవడం, సరైన ఉద్యోగ సమాచారం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలకు పరిష్కారంగా ఈ పథకాలు పనిచేస్తున్నారు. స్కిల్ ట్రైనింగ్, అప్రెంటిస్‌షిప్, ఉద్యోగ అనుసంధానం, నేరుగా నియామక కార్యక్రమాలు అందిస్తూ నిరుద్యోగితను తరిమికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకాలు నిరుద్యోగులను ప్రస్తుత మార్కెట్ కోసం సిద్ధం చేయడమే కాకుండా, ఉద్యోగం పొందే అవకాశాలను కూడా పెంచుతున్నాయి.