AI జమానాలో సేఫ్ జాబ్స్ ఇవే..
ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గురించే చర్చ. చాట్‌జీపీటీ, జెమిని లాంటి టూల్స్ వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి కంటెంట్ రైటర్ల వరకు 'ఉద్యోగం పోతుందేమో?' అని భయపడుతున్నారు. అయితే టెక్నాలజీ అవసరం లేకుండా పక్కా మనుషులు అవసరమయ్యే ఉద్యోగాలు అనేకం ఉన్నాయి. అలాంటివే ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వడ్రంగి వంటి చేతిపనులు.. వీటిని ఏ టెక్నాలజీ, ఏ రోబోలు రీప్లేస్ చేయలేవు. అందుకే కోడింగ్ చేసేవారి కంటే వెల్డర్ లేదా ప్లంబర్ ఉద్యోగం సురక్షితం.
చేతి నైపుణ్యాలదే ఇక హవా
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు : ప్రతి ఇంటి నిర్మాణం వేరువేరుగా ఉంటుంది... ఒక్కో ఇంట్లో రిపేర్లు వేర్వేరుగా ఉంటాయి. దీనికి అవసరమైన శారీరక నైపుణ్యం, ఆయా ప్రదేశానికి తగినట్లు ఆలోచించే సామర్థ్యం రోబోలకు ఇంకా రాలేదు. అందుకే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు ఏఐతో దోకా లేదు.
నిర్మాణ కార్మికులు & ఆర్కిటెక్ట్‌లు: సైట్ వాతావరణానికి అనుగుణంగా మారే పనులకు మనుషుల ప్రత్యక్ష ప్రమేయం అవసరం. ఇంటికి అవసరమైన నిర్మాణాలు, అందంగా తీర్చిదిద్దేలా చేయడం మనుషులతోనే సాధ్యం. అందుకే నిర్మాణరంగంపై ఏఐ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు.