Jobs : AI అస్సలు తాకలేదు.. వచ్చే 50 ఏళ్ల వరకు ఫుల్ సేఫ్‌గా ఉండే టాప్ ఉద్యోగాలు ఇవే

Published : May 28, 2026, 01:40 PM IST

Top Jobs Safe From AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత స్పీడ్‌గా దూసుకొచ్చినా కొన్ని ఉద్యోగాలను మాత్రం అస్సలు టచ్ చేయలేదు. నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు 100% సేఫ్‌గా ఉండే ఆ జాబ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఏఐ తో సాఫ్ట్‌వేర్ వాళ్లకే టెన్షన్.. వాళ్లకు మాత్రం ఫుల్ చిల్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే టాపిక్.. అదే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI). చాట్ జిపిటి, మిడ్‌జర్నీ, జెమిని లాంటి టూల్స్ చూస్తుంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి కంటెంట్ రైటర్ల వరకు అందరికీ లోపల లైట్‌గా వణుకు మొదలైంది. "అసలు రేపు పొద్దున మా ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా?" అన్నదే అందరి భయం.

అయితే, టెక్నాలజీ ఎంత నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లినా.. కొన్ని ఉద్యోగాలను మాత్రం ఏఐ అస్సలు ఏమీ చేయలేదు. వచ్చే 50 ఏళ్ల వరకు కాదు కదా.. ఎప్పటికీ వీటికి ఢోకా లేదు. రెడ్డిట్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నెటిజన్లు, టెక్ నిపుణులు జరిపిన హాట్ డిస్కషన్స్ ప్రకారం.. ఏఐ అస్సలు టచ్ చేయలేని ఆ ఎవర్ గ్రీన్ జాబ్స్ ఏంటో మీకు తెలుసా?

25
చేతి నైపుణ్యం, ఫిజికల్ వర్క్.. బ్లూ కాలర్ జాబ్స్ ఆర్ ది న్యూ కింగ్స్

మనం చూస్తున్న ఏఐ విప్లవం అంతా డిజిటల్ స్క్రీన్ల వరకే పరిమితం. కానీ ప్రాక్టికల్‌గా, భౌతిక ప్రపంచంలోకి వస్తే ఏఐ చేతులెత్తేస్తుంది. ఉదాహరణకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు, వడ్రంగి, హెచ్‌వీఏసీ వంటి టెక్నికల్ రిపేర్ వర్క్స్ ఉన్నాయి. ఒక పాత ఇంట్లో గోడ వెనుక ఎక్కడో వైరింగ్ కాలిపోతే, దాన్ని కనిపెట్టి సరిచేయడం ఒక రోబో వల్ల అవుతుందా? క్లిష్టమైన కోణంలో పైప్ లీకేజీ అవుతుంటే దానికి అప్పటికప్పుడు ఐడియా వేసి రిపేర్ చేయాలి.

ప్రతి ఇల్లు, ప్రతి బిల్డింగ్ ఒకేలా ఉండవు. కాబట్టి అక్కడ వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి ఒక అల్గోరిథం తక్షణ పరిష్కారం చూపలేదు. అందుకే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కోడింగ్ చేసే వాళ్ల కంటే, ఒక వెల్డర్ లేదా ప్లంబర్ కెరీరే లాంగ్ రన్‌లో ఫుల్ సేఫ్ అని టెక్ నిపుణులే చెప్తున్నారు.

35
హెల్త్‌కేర్ & మెడికల్ రంగం

వైద్య రంగంలో ఏఐ కేవలం ఒక సపోర్టింగ్ టూల్‌గా మాత్రమే పనికొస్తుంది. రోగాలను గుర్తించడానికో, లేదా డేటాను అనలైజ్ చేయడానికో ఏఐ వాడొచ్చు. కానీ నర్సింగ్, థెరపీ, మిడ్ వైఫరీ లాంటి విభాగాల్లో మనుషులు చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఒక పేషెంట్‌కి అనారోగ్యం వచ్చినప్పుడు వారికి కావాల్సింది కేవలం మందులు మాత్రమే కాదు.. మానసిక సపోర్టు.

వారి కళ్లలోకి చూసి, బాధను పంచుకుంటూ, ఎంపతీ చూపించడం కేవలం మనుషులకు మాత్రమే సాధ్యం. యంత్రాలు ఎంత అడ్వాన్స్ అయినా మనోభావాలను అర్థం చేసుకోలేవు. అలాగే సర్జన్లు, డెంటిస్ట్‌లు కేవలం టెక్నాలజీ మీదే ఆధారపడరు. సర్జరీ టేబుల్‌పై పేషెంట్ కండిషన్‌ను బట్టి సెకన్ల వ్యవధిలో స్పాంటేనియస్‌గా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంద్రియ ప్రతిస్పందన, మానవీయ కోణం అవసరమయ్యే ఈ జాబ్స్ ఎప్పటికీ సేఫ్.

45
లా & లీగల్ సిస్టమ్ కూడా సేఫ్ జాబ్స్

న్యాయశాస్త్రం లాంటి లైసెన్స్ పొందిన వృత్తులకు ఏఐ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. చట్టపరమైన చిక్కులను విశ్లేషించడం, కోర్టులో జడ్జ్ ముందు వాదించడం వంటి పనుల్లో సామాజిక అవగాహన, నైతిక విలువలు ఎంతో ముఖ్యం. ఏఐ ప్రపంచంలోని చట్టాలన్నింటినీ డేటా రూపంలో క్రోడీకరించి ఇవ్వగలదేమో కానీ, సమాజ హితాన్ని, మానవ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కోర్టులో ఎమోషనల్‌గా, లాజికల్‌గా వాదించలేదు. ఒక మనిషి మైండ్ సెట్‌ను చదవడం లాయర్లకు ఉన్న ప్రత్యేక నైపుణ్యం. అందుకే లీగల్ ఫీల్డ్‌లో మనుషుల స్థానాన్ని రీప్లేస్ చేయడం ఇంపాజిబుల్.

55
ఫ్యూచర్ మనదే.. కాకపోతే స్కిల్స్ అప్‌గ్రేడ్ అవ్వాలి

వచ్చే యాభై ఏళ్లలో ఏ ఉద్యోగం 100 శాతం సురక్షితం కాదని కొందరు నెగెటివ్‌గా మాట్లాడినా.. అందులో వాస్తవం లేదు. శారీరక శ్రమతో కూడిన వృత్తులు, ఎంపతీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమయ్యే రంగాలకే భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

సాంకేతికత అనేది మన పనిని సులువు చేసే ఒక సాధనం మాత్రమే, కానీ అది మనల్ని పూర్తిగా రీప్లేస్ చేయలేదు. సో.. ఫ్యూచర్ గురించి టెన్షన్ పడకుండా, ఏఐ చేయలేని మానవీయ నైపుణ్యాలను పెంచుకుంటూ, నిరంతరం అప్‌గ్రేడ్ అవ్వడమే మన ముందున్న బెస్ట్ ఆప్షన్ అని కెరీర్ నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories