RBI Recruitment : రూ.18 లక్షల హై శాలరీతో.. ఎగ్జామ్ లేకుండానే రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు పొందే లక్కీ ఛాన్స్

Published : Jun 17, 2026, 07:56 PM ISTUpdated : Jun 17, 2026, 08:11 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాా (RBI) పలు విభాగాల్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ అవకాశం యువతను బాగా ఆకర్షిస్తోంది. 

PREV
15
రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాలు

భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యువత అద్భుత అవకాశం కల్పిస్తోంది… పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది. అందుకే RBI జాబ్స్ నోటిఫికేషన్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న యువకులను నియమించుకోవడమే ఈ రిక్రూట్‌మెంట్ లక్ష్యం.

25
ఆర్బిఐలో భర్తీచేసే పోస్టులివే

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ మార్కెట్ రీసెర్చ్, పాలసీ రీసెర్చ్, సైబర్ సెక్యూరిటీ, సస్టైనబుల్ ఫైనాన్స్, క్వాంటం టెక్నాలజీ, క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్ ఆండ్ రెగ్యులేటరీ పాలసీ, పేమెంట్ ఎకోసిస్టమ్ వంటి పలు విభాగాల్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను ఆర్బిఐ భర్తీ చేస్తోంది. ఇలా మొత్తం 12 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది.. వర్క్ లొకేషన్ ముంబైలోని ఆర్‌బీఐ హెడ్ ఆఫీస్‌.

35
ఆర్బిఐ లో ఉద్యోగాలకు అర్హతలు

ఆర్బిఐ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 21 ఏళ్లు, గరిష్ఠంగా 30 ఏళ్లు ఉండాలి. ప్రతి విభాగానికి వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించింది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. తగిన అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

45
ఆర్బిఐలో నెలకు రూ.1.5 శాలరీ

ఆర్బిఐ పోస్టులను మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.5 లక్షల ఫిక్స్‌డ్ స్టైఫండ్ అందిస్తారు. అంటే ఏడాదికి రూ.18 లక్షలు సంపాదన అన్నమాట. 

నెలనెలా లక్షల్లో జీతం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థలో పనిచేసే అవకాశం కావడంతో ఆర్బిఐ నోటిఫికేషన్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది… వచ్చే నెల జూలై 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

55
కేవలం ఇంటర్వ్యూకు హాజరైతే జాబ్..

ఆర్బిఐ రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి రాత పరీక్ష లేదు… కేవలం ప్రాథమిక అర్హత పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారానే తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్‌బీఐ అధికారిక నోటిఫికేషన్ చూసి, అవసరమైన పత్రాలతో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిస్తే ఓ ఉద్యోగం మీదే… దీంతో నెలనెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories