Income Tax Rules 2026: మీరు ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మార్చి 20, 2026 నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను నిబంధనలను నోటిఫై చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం పన్ను మినహాయింపులు పెరిగాయి. 5 కీలక మార్పులు ఏంటో తెలుసుకోండి.
కొత్త ఐటీ రూల్స్ ప్రకారం… ఉద్యోగుల మీల్ కార్డ్‌పై ఇప్పుడు లక్షకు పైగా పన్ను మినహాయింపు లభిస్తుంది. సోడెక్సో, ప్లక్సీ (ఆఫీసులు, పాఠశాలలు, ఆసుపత్రులలో క్యాటరింగ్ సేవలు అందించే సంస్థలు) వంటి ఫుడ్ కూపన్లు వాడే ఉద్యోగులకు ఇది అతిపెద్ద ఊరట. ఆఫీస్ పనివేళల్లో భోజనం లేదా వోచర్లపై పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచారు.. ఒక్కో మీల్‌కు రూ.50 నుంచి నేరుగా రూ.200కి పెంచారు. నెలకు 22 పనిదినాలు, రోజుకు రెండు మీల్స్ చొప్పున లెక్కిస్తే మీరు ఏటా రూ.1,05,600 వరకు మీల్ వోచర్‌పై పన్ను లేకుండా పొందవచ్చు. 30% ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్న ఉద్యోగులు ఈ మార్పుతో సంవత్సరానికి సుమారు రూ.24,710 నేరుగా ఆదా చేసుకోగలుగుతారు.
25
హౌస్ రెంట్ అలవెన్స్ లో మార్పులు..
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) నిబంధనలలో చేసిన మార్పు లక్షలాది మందికి గేమ్ ఛేంజర్ కానుంది. ఢిల్లీ, ముంబై కాకుండా ఇతర పెద్ద నగరాల్లో నివసించే వారికి ఇది పెద్ద ఊరట. ప్రభుత్వం ఇప్పుడు పూణె, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాలను కూడా మెట్రో సిటీ కేటగిరీలో చేర్చింది. అంటే ఈ నగరాల్లో అద్దెకు ఉండే ఉద్యోగులు ఇప్పుడు తమ బేసిక్ శాలరీలో 50% వరకు HRA క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇది కేవలం 40% మాత్రమే ఉండేది.
35
పిల్లల పేరెంట్స్ కి ఊరట
పిల్లలను కలిగిన తల్లిదండ్రులకు ఈ కొత్త ఐటీ రూల్స్ చాలా ఉపశమనం కలిగిస్తుంది. దశాబ్దాలుగా ఉన్న పాత అలవెన్సులను ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చింది. ఇప్పటివరకు పిల్లల చదువు కోసం ఇచ్చే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ నెలకు కేవలం రూ.100 ఉండేది. దాన్ని ఇప్పుడు నెలకు రూ.3,000కి పెంచారు. అదేవిధంగా, హాస్టల్ ఖర్చుల కోసం ఇచ్చే రూ.300 మినహాయింపును నెలకు రూ.9,000కి పెంచారు. పిల్లలు వేరే ఊళ్లలో ఉండి చదువుకునే కుటుంబాలకు ఈ మార్పు చాలా పెద్ద ఊరట. ఎందుకంటే ఇప్పుడు వారు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
మీరు మీ కంపెనీ నుంచి అనారోగ్యం లేదా వ్యక్తిగత అవసరాల కోసం వడ్డీ లేని (Interest-free) లోన్ తీసుకుంటే, ఇప్పుడు రూ.2 లక్షల వరకు లోన్‌పై ఎలాంటి పన్ను (Perquisite) చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ పరిమితిని పెంచి ఉద్యోగులకు పెద్ద ఆర్థిక ఉపశమనం కల్పించింది. ఈ నిబంధన పాత, కొత్త పన్ను విధానాలకు (Old & New Tax Regimes) వర్తిస్తుంది. అత్యవసర సమయాల్లో బయట ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకునే బదులు, తమ కంపెనీ సహాయం తీసుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
55
కంపెనీ కారు వాడేవారికి షాక్..
కంపెనీ కారు సౌకర్యం (Motor Car Perquisites) పొందుతున్న వారికి ఈ కొత్త రూల్స్ కొద్దిగా షాక్ ఇవ్వొచ్చు. 1.6 లీటర్ల కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న పాపులర్ కార్లపై (ఉదాహరణకు Creta 1.5L లేదా Virtus 1.0L) పన్ను విలువను నెలకు రూ.600 నుంచి రూ.2,000కి పెంచారు. అంటే ఇప్పుడు మీ జీతంలో అదనంగా రూ.2,000 ప్రయోజనం చేకూరినట్లుగా భావించి, దానిపై మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. ఇది మీ చేతికి వచ్చే జీతంపై కొంత ప్రభావం చూపవచ్చు.