Job Quit: ఉద్యోగం చేసే చాలా మంది ఏదో ఒక రోజు మానేయాలనే ఆలోచనతో ఉంటారు. వ్యాపారం లేదా ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే ఉద్యోగం మానేసే ముందు కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది తమకు ఇష్టమైన పని చేస్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది అనుకుంటారు. కానీ వాస్తవ జీవితంలో ప్రతి ఉద్యోగం మనసుకు నచ్చేలా ఉండకపోవచ్చు. కొన్ని ఉద్యోగాలు కేవలం ఆర్థిక భద్రత కోసం మాత్రమే చేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఉద్యోగం జీవిత లక్ష్యం అవ్వాలని ఆశించడం సరైంది కాదు. కొన్నిసార్లు ఒక ఉద్యోగం మనకు అనుభవం, స్థిరత్వం, తదుపరి అవకాశాల కోసం పునాది మాత్రమే అవుతుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే ఉద్యోగ ఒత్తిడి కొంత తగ్గుతుంది.
25
ఉద్యోగంతోనే మన విలువ నిర్ణయిస్తారా.?
చాలామంది తమ జీతం, పదవి లేదా కంపెనీ పేరుతోనే తమ విలువను కొలుస్తారు. కానీ ఒక ఉద్యోగంలో సమస్యలు రావడం లేదా గుర్తింపు రాకపోవడం వల్ల మన వ్యక్తిత్వం తగ్గిపోదు. మీరు ఒక మంచి మనిషి, మంచి స్నేహితుడు, కుటుంబ సభ్యుడు కూడా అని గుర్తుంచుకోవాలి. ఉద్యోగంలో ఎదురైన సమస్యలను వ్యక్తిగత వైఫల్యంగా భావించకూడదు. ఉద్యోగాన్ని వ్యక్తిగత జీవితానికి వేరు చేసి చూడడం నేర్చుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
35
జీవితం ఆఫీస్‌కే పరిమితం కాదు
ఉద్యోగ ఒత్తిడిలో చాలా మంది తమ కోసం సమయం కేటాయించడం మర్చిపోతారు. కానీ మానసిక ప్రశాంతత కోసం చిన్న చిన్న అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. ఉదయం కొద్దిసేపు నడక, ఇష్టమైన పాటలు వినడం, పాత హాబీలను మళ్లీ ప్రారంభించడం, కుటుంబంతో సమయం గడపడం వంటి పనులు మనసుకు రిలీఫ్ ఇస్తాయి. ఇవి జీవితం కేవలం ఆఫీస్ వరకే కాదని గుర్తు చేస్తాయి.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వదలాలనే నిర్ణయం తీసుకుంటే ముందుగా కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిది. కొత్త కోర్సులు నేర్చుకోవడం, ఇతర రంగాల వారితో మాట్లాడడం, ఫ్రీలాన్స్ పనులు చూడడం వంటి చర్యలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగం చేస్తూనే కొత్త మార్గాలను వెతకడం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఏ రంగం మనకు సరిపోతుందో అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
55
నిర్ణయం తీసుకునే ముందు మీకోసం సమయం తీసుకోండి
కెరీర్ ఎంత ముఖ్యమో, వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. మంచి స్నేహితులు, కుటుంబం, ఆరోగ్యం, మనసుకు నచ్చిన పనులు ఇవన్నీ కలిసి జీవితం సంతోషంగా మారుస్తాయి. మన ఆనందం పూర్తిగా ఉద్యోగంపై ఆధారపడకుండా చూసుకోవాలి. అప్పుడు ఉద్యోగ సమస్యలు వచ్చినా మనసు బలంగా ఉంటుంది. అందుకే ఉద్యోగం మానేయాలనిపించినప్పుడు తొందరపడకుండా కొంత సమయం తీసుకుని, సరైన ప్లాన్‌తో ముందుకు వెళ్లడం మంచిది.