అన్ని పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.250/-. అయితే ప్రారంభంలో అందరు అభ్యర్థులు ఒక దరఖాస్తుకు రూ.750/- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజును ఈ క్రింది విధంగా తిరిగి ఇస్తారు:
* దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన అభ్యర్థులకు (మహిళలు, SC/ST/ PwBD, మాజీ సైనికులు) రూ.750 పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది.
* రాత పరీక్షకు హాజరైన మహిళలు, SC/ST/ PwBD, మాజీ సైనికులు కాకుండా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు పోను రూ.500 తిరిగి ఇవ్వబడుతుంది.
పరీక్షా కేంద్రాలు :
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఒక్కటే పరీక్షాకేంద్రం. దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గౌహతి, కోల్ కతా, లక్నో, న్యూడిల్లీ, తిరువనంతపురం కూడా పరీక్షా కేంద్రాలే.