Jobs: జ‌ర్మీనీలో న‌ర్స్ ఉద్యోగాలు, నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు జీతం.. తెలంగాణ వారికి అవ‌కాశం.

Published : May 07, 2025, 09:02 AM IST

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం తెలంగాణ‌ ప్రభుత్వ ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వ‌హిస్తోంది. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనుంది.   

PREV
15
Jobs: జ‌ర్మీనీలో న‌ర్స్ ఉద్యోగాలు, నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు జీతం.. తెలంగాణ వారికి అవ‌కాశం.

‘ట్రిపుల్ విన్ ప్రాజెక్ట్’ కింద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ నుంచి అర్హత ఉన్న నర్సులకు జర్మనీలో పని చేసే అవకాశం లభించనుంది. ఈ ప్రాజెక్టు జర్మనీ ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ (BA), జర్మన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సంస్థ (GIZ) భాగస్వామ్యంతో నిర్వ‌హించ‌నున్నారు. ఈ నియామ‌కానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

25

telangana govt

అర్హతలు: 

* జర్మన్ భాషలో B1 స్థాయి సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం. లేకపోతే నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలి.

* GNM లేదా B.Sc నర్సింగ్ డిగ్రీ తెలంగాణలో గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఉండాలి.

* వయస్సు: 21 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

* 3 ఏళ్ల పని అనుభవం (GNM అభ్యర్థులకు తప్పనిసరి).

* ఇండియన్ నర్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నవారికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. 

* ఎల్డర్లీ కేర్, ప్యాలియేటివ్ కేర్, గెరియాట్రిక్స్, కార్డియాలజీ, ఆపరేషన్ థియేటర్, సైకియాట్రి వంటి విభాగాల్లో అనుభవం ఉన్నవారికి అధిక ప్రాధాన్యం.

35

జీతం వివరాలు:

అభ్యర్థులు హైదరాబాద్లో B1 స్థాయి వరకు జర్మన్ భాష శిక్షణ పొందవచ్చు. శిక్షణ పూర్తయ్యాక, జర్మనీలోని ఆసుపత్రుల్లో నర్సింగ్ అసిస్టెంట్లుగా నియ‌మిస్తారు. రెగనిషన్ ప్రాసెస్ సమయంలో నెల‌కు కనీస  €2300 మ‌న క‌రెన్సీలో రూ. 2,20,788, పూర్తి గుర్తింపు త‌ర్వాత నెల‌కు రూ. 2,68,786 జీతం ల‌భిస్తుంది. ఓవ‌ర్ టైమ్ చేస్తే అద‌నంగా జీతం ల‌భిస్తుంది. 

45
Nurse

దరఖాస్తు ఎలా చేయాలి?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 మే 15లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్య‌ర్థులు త‌మ రెజ్యూమ్‌ను germanytriplewin2025@gmail.com కు పంపాలి లేదా  9440051581, 9440048500, 9440052081 నెంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు. 

55
germany nurses

TOMCOM అంటే ఏంటి.? 

TOMCOM అనేది తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని అధికారిక రిక్రూట్మెంట్ ఏజెన్సీ. దీని ప్రధాన లక్ష్యం విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను తెలంగాణ అభ్యర్థులకు అందించడం. TOMCOM ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగరీ, జపాన్, రోమేనియా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ వంటి అనేక దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసింది. విదేశాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను తెలుగు యువతకు అందజేయడమే సంస్థ ఉద్దేశ్యం.

Read more Photos on
click me!

Recommended Stories