ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే యువతకు అద్భుత అవకాశం. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Government Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ వ్యవస్థలో ఎంతో కీలకమైన ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 394 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.. ఇవాళ్టి (ఆగస్ట్ 23, శనివారం) నుండే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యింది... అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడం, మంచి సాలరీ ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.
భారతదేశ రక్షణ, గూఢచర్య సమాచారాన్ని సేకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఉద్యోగాలు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోరుకునే యువతకు ఇది సువర్ణావకాశం. టెక్నికల్ ఫీల్డ్ లో ప్రతిభావంతులైన యువతీయువకులు దేశ సేవలో చేరేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు, జీతం, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
26
IB లో భర్తీచేయనున్న ఉద్యోగాలివే
ఈ నోటిఫికేషన్ ద్వారా IB లో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ -2 (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వవచ్చు... కాబట్టి ఎక్కడినుండయినా పనిచేయడానికి సిద్దంగా ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలి.
రిజర్వేషన్లవారిగా ఖాళీల వివరాలు :
జనరల్ (Unreserved) : 157 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Section) : 32 ఉద్యోగాలు
ఓబిసి (Other Backword Classes) : 117 పోస్టులు
ఎస్సి (Sheduled Caste) : 60 పోస్టులు
ఎస్టి (Sheduled Tribe) : 28 పోస్టులు
మొత్తం 394 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
36
IB ఉద్యోగాలకు అర్హతలు
IB ఉద్యోగాలకు విద్యార్హతలు :
ఇంజనీరింగ్ లో డిప్లోమా లేదా బిటెక్, బిఎస్సి, బిసిఏ డిగ్రీల్లో ఏదోఒకటి పూర్తిచేసి వుండాలి. టెక్నికల్ ఉద్యోగాలు కాబట్టి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసినవారికి ఇది మంచి అవకాశం.
IB ఉద్యోగాలకు వయోపరిమితి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సెప్టెంబర్ 14, 2025 నాటికి 18 నుండి 27 ఏళ్లలోపు వయసు ఉండాలి. రిజర్వేషన్స్ ఆధారంగా అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబిసిలకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు మహిళలు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు రూ.550, ఇతరులకు రూ.650 ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్ లో ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
56
IB ఉద్యోగాలకు ఎంపిక విధానం
ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రతి దశలోనూ ఉత్తీర్ణులైన వారే ఫైనల్ గా ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
66
ఐబిఉద్యోగాల సాలరీ
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుండి రూ.81,100 వరకు జీతం లభిస్తుంది. ఇది మంచి జీతంతో స్థిరమైన జీవితాన్ని ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాల్లో లభించే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.