పదో తరగతి చదవకున్నా సరే .. మీకు ఈ అర్హతలుంటే ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, వెంటనే అప్లై చేసుకొండి

Published : Nov 07, 2025, 10:45 AM IST

కనీసం పదో తరగతి పాస్ కాకపోయినా సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం… మీకు ఈ అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేసుకొండి.. మంచి సాలరీతో కూడిన జాబ్ ఈజీగా పొందండి.

PREV
16
యువతకు గుడ్ న్యూస్...

Government Jobs : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆయుష్ శాఖ పరిధిలోని హోమియోపతి పరిశోధన మండలి (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి - CCRH) లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న CCRH కార్యాలయాల్లో వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు… ఇందుకోసం మొత్తం 90 ఖాళీలను ప్రకటించారు.

26
CCRHలో వివిధ పోస్టులు, జీతాల వివరాలు

ఈ ప్రకటనలో 10వ తరగతి కంటే తక్కువ నుండి మెడికల్ డిగ్రీ (MD) వరకు వివిధ విద్యా అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేలా చాలా పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), డ్రైవర్ లాంటి పోస్టులు 10వ తరగతి కంటే తక్కువ, 12వ తరగతి అర్హత ఉన్నవారికి అందుబాటులో ఉన్నాయి.

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుకు 27 ఖాళీలు, డ్రైవర్ పోస్టుకు 2 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 8వ తరగతి నుండి 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి నెల జీతం రూ. 19,900/- నుండి రూ.63,200/- వరకు ఉంటుంది.

గరిష్టంగా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ పోస్టుకు 28 ఖాళీలు, రీసెర్చ్ ఆఫీసర్ (హోమియోపతి) పోస్టుకు 12 ఖాళీలు ఉన్నాయి. రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుకు హోమియోపతిలో MD డిగ్రీ అవసరం, గరిష్టంగా రూ.1,77,500/- వరకు జీతం పొందవచ్చు.

ఫార్మసిస్ట్ (3 ఖాళీలు), స్టాఫ్ నర్స్ (9 ఖాళీలు) లాంటి ఇతర టెక్నికల్ పోస్టులకు కూడా ఉన్నాయి. 12వ తరగతి ఉత్తీర్ణత, డిప్లొమా లేదా B.Sc. నర్సింగ్ విద్యార్హతలతో, మంచి జీతంతో ఉద్యోగాలను ప్రకటించారు.

36
ఇతర అర్హతలు

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుకు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌పై నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్ చేసే నైపుణ్యం అవసరం.

డ్రైవర్ పోస్టుకు గుర్తింపు పొందిన పాఠశాలలో మిడిల్ స్కూల్ ఉత్తీర్ణత, హెవీ, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రెండేళ్ల అనుభవం అవసరం.

46
దరఖాస్తు విధానం

అభ్యర్థులు CCRH అధికారిక వెబ్‌సైట్ https://ccrhindia.ayush.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 05 నవంబర్ 2025

దరఖాస్తుకు చివరితేదీ : 26 నవంబర్ 2025

దరఖాస్తు ఫీజు:

రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుకు: అన్ రిజర్వుడ్, ఓబిసి, ఈడబ్ల్యుఎస్ వర్గాల వారికి రూ1,000/- దరఖాస్తు ఫీజు ఉంది. ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఇతర పోస్టులకు: అన్ రిజర్వుడ్, ఓబిసి, ఈడబ్ల్యుఎస్ వర్గాల వారికి రూ. 500/-. ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

56
వయోపరిమితి

గ్రూప్ A ఉద్యోగాలకు 40 ఏళ్లలోపు వయసుండాలి. ఇక గ్రూప్ బి, సి ఉద్యోగాలకు 18 నుండి 27 ఏళ్లలోపు వయసువారు అర్హులు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సి/ ఎస్టి వర్గాల వారికి 5 ఏళ్లు, ఓబిసి వర్గాల వారికి 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుండి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.

66
ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అర్హులైన యువత చివరి తేదీ వరకు వేచి ఉండకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ ను మరోసారి చూడండి. 

Read more Photos on
click me!

Recommended Stories