ఈ ప్లాట్‌ఫాంను అభిషేక్ ప్రకాశ్, లేఖ గుణశేఖర్ అనే దంపతులు ప్రారంభించారు. అభిషేక్ తెలంగాణలో పుట్టి, ముంబైలో పెరిగి, తరువాత తమిళనాడు, పంజాబ్, కర్ణాటకల్లో పని చేశారు. ఈ ప్రయాణంలో ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. “భాష అనేది మనుషులను, సంస్కృతులను కలుపుతుంది.” అయితే భారతీయ భాషలను నేర్చుకునే రిసోర్సులు చాలా తక్కువగా ఉన్నాయని గ్రహించారు. విదేశీ భాషలైన ఫ్రెంచ్, జర్మన్‌లకు ఆన్‌లైన్ కోర్సులు సులభంగా దొరుకుతుంటే, మన దేశ భాషలకు ఆ అవకాశాలు లేవు. అందుకే ఈ ప్లాట్‌ఫాం ప్రారంభించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.
భవిష్యత్ లక్ష్యం
“భాషలను ఒక హాబీగా, సరదాగా నేర్చుకునేలా చేయడం మా ఉద్దేశ్యం” అంటున్నారు అభిషేక్. ప్రస్తుతం భాషలు నేర్చుకుంటున్న వారిలో 50% మంది భారతీయులే. మిగతావారు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐల పిల్లలు, భారతీయ సంస్కృతిపై ఆసక్తి ఉన్న విదేశీయులు. 2023 చివర్లో ప్రారంభమైన ‘భాషాఫై’ లక్ష్యం.. అన్ని భారతీయ భాషలను ఒకే వేదికలోకి తెచ్చి, అందరికీ నేర్చుకునే అవకాశం కల్పించడం.