ఎంత కాదన్నా ప్రతీ ఒక్కరూ చదువుకునేది ఉద్యోగం కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని పొందాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అత్యధికంగా జీతాలు వచ్చే కొన్ని ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్షల్లో జీతాలు రావాలంటే ఇప్పటికీ చాలామందిలో ఉన్న భావన ఇంజనీరింగ్ లేదా డాక్టర్ అయ్యుండాలి. వీరికే ఎక్కువ జీతాలు వస్తాయన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇతర రంగాల్లో కూడా లక్షల్లో జీతాలు వస్తున్నాయి. అలాంటి కొన్ని రంగాలపై ఓ లుక్కేయండి.
26
యానిమేషన్, గేమ్ డిజైన్ రంగం
OTT, మొబైల్ గేమ్స్, వర్చువల్ రియాలిటీ (VR) వృద్ధి చెందడంతో యానిమేటర్లు, గేమ్ డిజైనర్లుకి భారీ డిమాండ్ పెరుగుతోంది. ఈ రంగంలో కెరీర్ బిల్డప్ చేసుకోవాలంటే B.Des, BFA లేదా Arena Animation, MAAC వంటి సంస్థల నుంచి డిప్లోమా చేయొచ్చు. ఈ రంగంలో మీ ప్రతిభ ఆధారంగా రూ. 4 నుంచి రూ. 8 లక్షల ప్రారంభ వార్షిక జీవితం పొందొచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ఏడాదికి రూ. 15 లక్షల వరకు జీతం పొందొచ్చు.
36
సైబర్ సెక్యూరిటీ రంగం
ప్రస్తుత డేటా యుగంలో ప్రతి కంపెనీకి సిస్టమ్ సెక్యూరిటీ ముఖ్యం. ఈ పని చేసే వారే ఎథికల్ హ్యాకర్స్, ఇది చట్టబద్ధమైన హ్యాకింగ్. ఈ రంగంలో రాణించాలంటే BCA/MCA చేసి, CEH లేదా OSCP సర్టిఫికేషన్లు తీసుకోవాలి. ఈ రంగంలో సర్టిఫికేషన్ పొందిన వారికి ప్రారంభ వేతంగా రూ. 8 నుంచి రూ. 10 లక్షల జీతం పొందొచ్చు. అనుభవంతో ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 లక్షల వార్షిక ఆదాయం లభిస్తుంది.
ఇప్పుడు ప్రతి వ్యాపారం ఆన్‌లైన్ మద్దతుతోనే నడుస్తోంది. అందుకే డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కు మార్కెట్లో డిమాండ్ నెలకొంది. ఈ రంగంలో రాణించాలంటే ఏదైనా డిగ్రీ ఉండాలి. అలాగే గూగుల్, మెటా, కర్సెరా వంటి వాటి నుంచి సర్టిఫికేషన్లు కూడా పొందొచ్చు. ఈ రంగంలో ఉద్యోగం లభిస్తే రూ. 5 నుంచి రూ. 8 లక్షల వార్షిక జీతం పొందొచ్చు. మంచి అనుభవం ఉన్న వారికి రూ. 15 నుంచి రూ. 20 లక్షల వార్షిక ఆదాయం అందిస్తారు.
56
ప్రొడక్ట్ మేనేజర్
ఒక కంపెనీలో ప్రొడక్ట్ ఎలా ఉండాలి? ఎలాంటి మార్పులు అవసరం? వంటి బాధ్యతలను ప్రొడక్ట్ మేనేజర్ చూసుకుంటారు. ఎంబీఏ, బీబీఏ వంటి కోర్సులు చేసిన వారు గూగుల్ లేదా ప్రొడక్ట్ స్కూల్ వంటి వాటి నుంచి సర్టిఫికేషన్లు పొందిన వారు అర్హులు. ప్రారంభ జీతం ఏడాదికి రూ. 10 నుంచి రూ. 12 లక్షలు ఉంటుంది. కాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ఏడాదికి రూ. 25 నుంచి రూ. 30 లక్షల వార్షిక ఆదాయం లభిస్తుంది.
66
ఆరోగ్య రంగంలో
ఆరోగ్యం రంగం అనగానే కేవలం వైద్యులు మాత్రమే గుర్తొస్తారు. కానీ ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. అందుకే న్యూట్రిషనిస్ట్, డైటీషియన్, ఫుడ్ క్వాలిటీ అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ రంగంలో ఉద్యోగం రావాలంటే బీఎస్సీ ఇన్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ, డైటిస్ట్ వంటి వాటివి పూర్తి చేయాలి. ఈ రంగంలో ప్రారంభ వేతనం రూ. 4 నుంచి రూ. 6 లక్షలు, అనుభవం ఆధారంగా రూ. 15 లక్షల వరకు ఆర్జించవచ్చు.