Government Job
మీకు హిందీ లేదా ఇంగ్లీష్‌లో మంచి టైపింగ్ స్కిల్స్ ఉంటే ఈజీగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. ప్రభుత్వ విభాగాల్లో టైపింగ్‌కి సంబంధించిన చాలా ఉద్యోగాలు ఉన్నాయి. మంచి జీతభత్యాలతో పాటు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. టైపింగ్ స్కిల్స్ ఉన్నవాళ్లకి ఏయే ఉద్యోగాలు బెస్ట్? ఈ ఏద్యోగాలకు ఎలా పొందాలి? ఇక్కడ తెలుసుకుందాం.
Stenographer Jobs
మీ టైపింగ్ స్పీడ్ బాగుంటే స్టెనోగ్రాఫర్ అవ్వడానికి సూపర్ ఛాన్స్ ఉంది. చాలా ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. గ్రాడ్యుయేట్ చేసినవాళ్లు అప్లై చేసుకోవచ్చు. కానీ, టైపింగ్ టెస్ట్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ సాలరీ రూ.56,100 నుంచి రూ.1,14,000 వరకు ఉంటుంది.
Government Job
మీకు స్థానిక భాషలో టైపింగ్ స్పీడ్ నిమిషానికి 25 పదాలు ఉంటే RO, ARO పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు ప్రభుత్వ పరిపాలనలో చాలా ముఖ్యం. వీరికి కూడా మంచి సాలరీ ఉంటుంది.
Data Entry Operator
ప్రభుత్వ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీ టైపింగ్ స్పీడ్ బాగుంటే, ఈ జాబ్ మీకు పర్ఫెక్ట్. ఈ పోస్టులో శాలరీ రూ.19,200 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.
Government Job
గవర్నమెంట్ టైపింగ్ జాబ్స్ ఎందుకు ఎంచుకోవాలి?
- పర్మినెంట్ జాబ్, మంచి శాలరీ
- పెన్షన్, హెల్త్‌కేర్, ప్రమోషన్ బెనిఫిట్స్
- టైపింగ్ స్కిల్ ఆధారంగా త్వరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్