ఏఐ ఏం చేయలేని మూడు ఉద్యోగాలివే :
1. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు :
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సృష్టించిందే ఈ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ. అలాంటిది ఈ రంగంలో ఉద్యోగాలనే ఏఐ మింగేసే ప్రమాదం ఉందని... భారీగా టెకీలు ఎఫెక్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ బిట్ గేట్స్ మాత్రం సాప్ట్ వేర్ ఉద్యోగులపై ఏఐ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు.
సాధారణ ప్రోగ్రామింగ్ పనులకు ఏఐ ఉపయోగపడవచ్చు... కానీ కోడింగ్ వంటి క్లిష్టమైన పనుల్లో ఏఐ పనిచేయదు. కోడింగ్ చేయాలంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి... ఖచ్చితత్వం చాలా ముఖ్యం. ఏమాత్రం అటు ఇటు అయినా కష్టమే. కాబట్టి మనుషులు చేసేంత పర్ఫెక్ట్ గా ఏఐ కోడింగ్ చేయలేదు... ఏదయినా కోడింగ్ సమస్య వచ్చినా ఏఐ పరిష్కరించలేదు... కాబట్టి సాప్ట్ వేర్ ఉద్యోగాల్లో మనుషుల అవసరం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి సాప్ట్ వేర్ ఉద్యోగులు సేఫ్ అనేలా బిల్ గేట్స్ కామెంట్స్ చేసారు.
2. ఎనర్జీ రంగం :
ప్రస్తుతం ఎనర్జీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాంప్రదాయ ఇందన వనరులతో సరికొత్తవి అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణానికి హాని కలిగించకుండా ఉండే పునరుత్పాదక ఇందన వనరులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎనర్జీ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎనర్జీ రంగ నిపుణుల మాదిరిగా ఏఐ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోలేదు... దీంతో ఈ రంగంలో ఉద్యోగాలను కొనసాగించక తప్పదు.