
Career Guidance : ఏదైనా పోటీ పరీక్షలో నెగ్గాలంటే కష్టపడి చదవటమే కాదు, తెలివైన పద్ధతులు, పక్కా ప్రణాళిక, నిరంతర ప్రయత్నం కూడా ఉండాలి. పోటీ ఎక్కువ అవ్వడంతో విద్యార్థులు టైమ్ మేనేజ్ చేయలేకపోతున్నారు. అయితే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసారంటే ఈ ప్రాబ్లం ఉండదు. ముందునుండే ప్రణాళికబద్దంగా ప్రిపేర్ అయితే ఎంతటి కఠినమైన పోటీ పరీక్షలో అయినా మంచిమార్కులు సాధించి ఎంతటి గొప్ప ఉద్యోగాన్నిఅయినా పొందవచ్చు.
స్మార్ట్ వర్క్ లో భాగంగా మీరు కొన్ని సూత్రాలు ఫాలో అయ్యారో జాబ్ పక్కా. అలాంటి ఈ 8 ప్రిపరేషన్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
1. పరీక్ష విధానం, సిలబస్ తెలుసుకోండి
ముందుగా పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. సిలబస్, మార్కుల గురించి పూర్తిగా తెలుసుకోండి. ఏ సబ్జెక్టుకి ఎక్కువ మార్కులు ఉంటాయో తెలుసుకొని దానికి తగ్గట్టుగా టైమ్ కేటాయించండి. అలాకాకుండా సగంసగం విషయాలు తెలుసుకుని ప్రిపరేషన్ ప్రారంభించడంవల్ల కన్ఫ్యూజన్ పెరుగుతుంది.
2. ఒక ప్రణాళిక వేసుకోండి
ఒక టైమ్ టేబుల్ వేసుకొని దాని ప్రకారం చదివితే మంచి ఫలితం ఉంటుంది. సిలబస్‌ను చిన్న భాగాలుగా చేసుకొని రోజు, వారం, నెలకి టార్గెట్లు పెట్టుకోండి. మీ టైమ్ టేబుల్‌లో ఇవి ఉండేలా చూసుకోండి:
• రివిజన్ చేయడానికి టైమ్
• మాక్ టెస్టులు రాయడం
• చిన్న బ్రేక్స్ తీసుకోవడం
• కష్టమైన సబ్జెక్టులకు టైమ్
3. చురుకైన పద్ధతులు వాడండి
పోటీ పరీక్షలకి మామూలుగా చదివితే సరిపోదు. కొన్ని చురుకైన పద్ధతులు వాడాలి:
• మైండ్ మ్యాపింగ్ & ఫ్లో చార్ట్స్: విషయాలను గుర్తు పెట్టుకోవడానికి.
• ఫేన్‌మాన్ టెక్నిక్: ఒక చిన్న పిల్లవాడికి చెప్పినట్టుగా చెప్పడం.
• SQ3R పద్ధతి (సర్వే, ప్రశ్న, చదవటం, చెప్పటం, రివ్యూ): అర్థం చేసుకోవడానికి.
• సెల్ఫ్-క్విజ్: మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం.
4. మాక్ టెస్టులు, పాత ప్రశ్నపత్రాలు
మాక్ టెస్టులు రాయడం వల్ల పరీక్ష ఎలా ఉంటుందో తెలుస్తుంది, దీనివల్ల వేగం, కచ్చితత్వం పెరుగుతాయి. అలాగే పాత ప్రశ్నపత్రాలు కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిని మీ ప్రిపరేషన్‌లో చేర్చుకోండి.
• తరచుగా అడిగే ప్రశ్నలు తెలుస్తాయి
• సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి
• పరీక్ష భయం తగ్గుతుంది
• ఎక్కడ వెనుకబడుతున్నారో తెలుస్తుంది
ప్రతి వారం ఒక మాక్ టెస్ట్ రాయండి.
5. టైమ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు
చాలా పోటీ పరీక్షల్లో టైమ్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రశ్నలను త్వరగా, కచ్చితంగా చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. ఈ చిట్కాలు పాటించండి:
• 2 నిమిషాల రూల్: ఒక ప్రశ్నకి 2 నిమిషాల కంటే ఎక్కువ టైమ్ తీసుకుంటే దాన్ని వదిలేయండి.
• 50-30-20 రూల్: 50% టైమ్ సులువు ప్రశ్నలకి, 30% మోడరేట్ ప్రశ్నలకి, 20% కష్టమైన ప్రశ్నలకి ఇవ్వండి.
• షార్ట్‌కట్ టెక్నిక్స్ నేర్చుకోండి: లెక్కలు చేయడానికి షార్ట్‌కట్ టెక్నిక్స్ నేర్చుకోండి.
6. రివిజన్ చేస్తూ ఉండండి
చదివింది గుర్తుండాలంటే రివిజన్ చేస్తూ ఉండాలి. ఒకేసారి కాకుండా, కొంచెం కొంచెంగా రివైజ్ చేయండి:
• కొత్త విషయాలు 24 గంటల్లో రివైజ్ చేయండి
• ముఖ్యమైన విషయాలు వారం తర్వాత రివైజ్ చేయండి
• నెలకు ఒకసారి మొత్తం సిలబస్ రివైజ్ చేయండి
7. ఆరోగ్యంగా ఉండండి
పరీక్షలో గెలవాలంటే ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.
• 7-8 గంటలు నిద్రపోండి.
• సమతుల్య ఆహారం తీసుకోండి.
• వ్యాయామం లేదా ధ్యానం చేయండి.
• బ్రేక్స్ తీసుకోండి.
8. మిమ్మల్ని మీరు నమ్మండి
మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు ఏదైనా సాధించగలరని నమ్మండి. పాజిటివ్‌గా ఉండండి, మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి.