BSNL Recruitment : బీఎస్ఎన్ఎల్ సంస్థలో 120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? విద్యా అర్హత ఏంటి? అనే విషయాలు వివరంగా చూద్దాం.
భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ టెలికాం సంస్థల పోటీని తట్టుకుని నిలబడింది బిఎస్ఎన్ఎల్. ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది... దీంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ తమ సేవలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఉద్యోగ నియామకాలు చేపట్టింది.
25
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు..
టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీకి బిఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెలికాం విభాగానికి 95, ఫైనాన్స్ విభాగానికి 25 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు ఈరోజు (ఫిబ్రవరి 5) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 7.
35
విద్యా అర్హతలు ఏంటి?
టెలికాం విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత రంగాల్లో పూర్తికాల బీఈ/బీటెక్ (BE/BTech) పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పైన చెప్పిన కోర్సుల్లో కనీసం 60% మార్కులు సాధించడం చాలా అవసరం.
ఇక ఫైనాన్స్ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్లు సీఏ (చార్టర్డ్ అకౌంటెన్సీ) లేదా కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ అర్హత కలిగి ఉండాలి.
బిఎస్ఎస్ పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్ల వయసు కనీసం 21 ఏళ్లు నిండిఉండాలి. గరిష్ఠంగా 30 ఏళ్ల లోపు ఉండాలి. వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలకు అంటే రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
55
ఎంపిక విధానం, శాలరీ..
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్‌తో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగంలో చేరిన వారికి ప్రాథమిక జీతం రూ.24,000 నుంచి రూ.50,000 వరకు ఉంటుంది. ఇది కాకుండా ఇతర అలవెన్సులు, వైద్య సదుపాయాలు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ అయిన bsnl.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను ఈ వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు.