Bank Jobs : యువతకు సూపర్ ఛాన్స్.. రూ.93,960 జీతంతో మెనేజర్ స్థాయి ఉద్యోగాలు

Published : Dec 12, 2025, 12:26 PM IST

Bank Jobs : మంచి శాలరీ, ఇతర అలవెన్సులతో మేనేజర్ స్థాయి ఉన్నత ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే అప్లై చేయండి… ఉద్యోగాన్ని పొందండి.  

PREV
17
బ్యాంక్ జాబ్స్

Bank Jobs : ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత బాగా డిమాండ్ ఉండేది బ్యాంక్ జాబ్స్ కే. మంచి జీతం, గౌరవప్రదమైన హోదా కలిగిన బ్యాంకు ఉద్యోగాల కోసం యువతీయువకులు ప్రత్యేకంగా సన్నద్దం అవుతుంటారు. ఇలాంటివారికి మంచి అవకాశం... నైనిటాల్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

27
నైనిటాల్ బ్యాంకులో ఖాళీలు

నైనిటాల్ బ్యాంక్ (Nainital Bank) లో మొత్తం 185 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో క్లర్క్ (CSA), ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), రిస్క్ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, క్రెడిట్ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్ ఆఫీసర్, మేనేజర్-ఐటీ లాంటి అనేక ముఖ్యమైన పదవులకు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు... కాబట్టి అన్ని అర్హతలున్న ఎవరైన దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశం.

37
ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 డిసెంబర్ 2025

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : 01 జనవరి 2026

రాతపరీక్ష తేదీ : 18 జనవరి 2026

47
దరఖాస్తు ప్రక్రియ

CSA పోస్టుకు దరఖాస్తు రుసుము ₹1000, ఆఫీసర్, మేనేజర్ పోస్టులకు ₹1500. ఆన్‌లైన్ దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ www.nainitalbank.bank.in ద్వారా మాత్రమే సమర్పించాలి. దరఖాస్తు చేసే ముందు మీ ఈమెయిల్, మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఈ ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు, జీతం ఆఫర్లను అధికారిక నోటిఫికేషన్‌లో చూసుకుని, అర్హులైన వారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవచ్చు.

57
వయోపరిమితి

ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న చాలా పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ స్థాయి పోస్టులకు గరిష్ట వయస్సు 35 నుంచి 40 ఏళ్ల వరకు పెంచారు. SC/ST, OBC, PwBD లాంటి వర్గాలకు సాధారణ వయో సడలింపు ఉంటుంది.

67
ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం తుది అభ్యర్థుల లిస్ట్ విడుదల చేస్తారు.

77
శాలరీ

నైనిటాల్ బ్యాంకు ఉద్యోగాలకు మంచి శాలరీ ఉంటుంది.

CSA పోస్టుకు ₹24,050 – ₹64,480

ఆఫీసర్ పోస్టుకు ₹48,480 – ₹85,920

మేనేజర్ పోస్టుకు ₹64,820 – ₹93,960 వరకు శాలరీ ఉంటుంది,

Read more Photos on
click me!

Recommended Stories