భారత ఉద్యోగులలో 61% మంది ఎఐ (AI) సాధనాలను రెగ్యులర్‌గా వాడుతున్నట్టు రిపోర్ట్ చెబుతోంది. మిలేనియల్స్ ఈ మార్పుకు ముందుండగా, గత ఏడాదితో పోలిస్తే వారి వినియోగం 13% పెరిగిందట. మరోవైపు, 90% మంది ఉద్యోగులు స్కిల్స్‌ను అప్‌డేట్ చేసే అవకాశం కల్పించే సంస్థలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
రాండ్స్‌టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ విశ్వనాథ్ పీఎస్ ఈ విషయమై మాట్లాడుతూ.. “ఇప్పటి ఉద్యోగులు సంపాదనకే పరిమితం కావడం లేదు. వారు పరస్పర విశ్వాసం, ఫ్రీడమ్ వంటి ప్రయోజనాలతో కూడిన సంస్థలను కోరుకుంటున్నారు. ఉద్యోగ మార్పు జోరు పెరుగుతోందని, సంస్థలు ఇక న్యాయమైన వర్క్ కల్చర్ ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని” తెలిపారు.