Bank Jobs : పోటీపరీక్ష లేకుండా గవర్నమెంట్ బ్యాంక్ జాబ్.. కేవలం ఇంటర్వ్యూకు అటెండైతే చాలు

Published : Oct 14, 2025, 07:03 PM IST

Bank Jobs : ఎలాంటి దరఖాస్తు ఫీజు అవసరం లేదు... రాత పరీక్ష కూడా లేదు. నేరుగా ఇంటర్వ్యూకు హాజరై తెలివితేటలతో మెప్పిస్తే చాలు బ్యాంక్ జాబ్ మీసొంతం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
15
కెనరా బ్యాంకులో ఖాళీల వివరాలు

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (CBSL) ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్/ఆఫీస్ వర్క్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది ప్రభుత్వరంగ బ్యాంక్… కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు సన్నద్దమయ్యేవారికి మంచి అవకాశం. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా భర్తీచేసే ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 17, 2025లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

25
జీతం, విద్యా అర్హతలు, వయోపరిమితి

ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలనెలా రూ.22,000 జీతం లభిస్తుంది. అలాగే ఇతర అలవెన్సులు పొందుతారు. 

ఏ సబ్జెక్టులతో అయినా డిగ్రీ (కనీసం 50% మార్కులతో) పాసైన వాళ్ళు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

35
దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. అంతేకాకుండా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కెనరా బ్యాంకు సెక్యూరిటీస్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. అర్హులైన అభ్యర్థులు కేవలం ఇంటర్వ్యూకు హాజరై మెరుగైన ప్రదర్శన చేస్తే చాలు… ఎంపిక చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూ నైపుణ్యాలు ఉన్నవారికి ఇది సువర్ణావకాశం.

45
దరఖాస్తు విధానం

అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో ఫిల్ చేయాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్ల సెల్ఫ్-అటెస్టెడ్ కాపీలతో పాటు applications@canmoney.in అనే ఈమెయిల్‌కు పంపాలి.

55
ముఖ్యమైన తేదీలు

• దరఖాస్తు ప్రారంభ తేదీ : 11.10.2025

• దరఖాస్తు చివరి తేదీ : 17.10.2025

అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అన్ని అర్హతలను పూర్తిగా చదివి నిర్ధారించుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories