Inspiring Story : ఏమిటీ.. రూ. 1.20 కోట్ల సాలరీతో ఉద్యోగమా..! : ఎవరీ ఆయుష్మాన్?

Published : Jun 20, 2025, 10:46 AM ISTUpdated : Jun 20, 2025, 11:01 AM IST

వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లలో జీతంతో ఓ యువకుడు ఉద్యోగాన్ని పొందాడు.  అలాగని అతడు ఏ ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి లో చదువుకోలేదు… ఓ రాష్ట్రస్థాయి విద్యాసంస్థలో చదువుకున్నాడు. ఆ యువకుడి సక్సెస్ స్టోరీని ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
ఏకంగా రూ.1.20 కోట్ల సాలరీతో ఉద్యోగం

Ayushman Tripathi : కొందరు మంచి ఉద్యోగం, నెలకు ఐదంకెల జీతం ఉంటే చాలనుకుంటారు. మరికొందరు ఆరంకెల జీతం అంటే లక్షల్లో సాలరీ వచ్చే ఉద్యోగాలను కోరుకుంటారు. భారతదేశంలో ఎక్కువశాతం యువత మొదటి కేటగిరీకి చెందినవారే... చాలా కొద్దిమంది మాత్రమే రెండో రకానికి చెందినవారు. అయితే లక్షల్లో సాలరీ ఇచ్చే ఉద్యోగాలంటే అంత ఆషామాషీ కాదు... ఎంతో టాలెంట్, మరెంతో పట్టుదల ఉండాలి... అప్పుడే అనుకున్నది సాధించగలరు.

తాజాగా ఓ యువకుడు పట్టుదలతో చదివి ఒకటి రెండు కాదు ఏకంగా నెలకు రూ.10 లక్షల సాలరీతో ఉద్యోగాన్ని పొందాడు. అంటే ఏడాదికి కోటీ ఇరవై లక్షల సాలరీ అన్నమాట. అయితే ఈ కుర్రాడు ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటి విద్యార్థి కాదు... రాష్ట్రస్థాయిలో ఓ సాధారణ విద్యాసంస్థలో చదివి ఈ స్ధాయి ఉద్యోగాన్ని పొందాడు. ఇలా సామాన్య కాలేజీలో చదివి అద్భుతం చేసిన ఈ యువకుడు నేటితరం యువతకు ఆదర్శం. కాబట్టి ఈ సక్సెస్ ఫుల్ స్టూడెంట్ గురించి తెలుసుకుందాం.

25
ఎవరీ ఆయుష్మాన్ త్రిపాఠి

ఆయుష్మాన్ త్రిపాఠి... గుర్తుపెట్టుకోండి ఈ పేరు భవిష్యత్ లో గట్టిగా వినిపించవచ్చు. అతడి టాలెంట్ అలాంటిది. ఇలా కాలేజీ నుండి బయటకు వస్తూనే అలా కోటీ ఇరవైలక్షల జీతంతో ఉద్యోగాన్ని సాధించాడంటేనే అర్థం చేసుకోవచ్చే... ఆయుష్మాన్ ఎంత టాలెంటెడ్ యువకుడో.

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు చెందిన ఆయుష్మాన్ చత్తీస్ ఘడ్ లో చదువుతున్నాడు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం NTPC (నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), నయా రాయ్ పూర్ లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ప్రస్తుతం అతడు అమెజాన్ వెబ్ సర్వీస్ లో ఇంటర్న్ షిప్ చేస్తున్నాడు.

35
IIIT-NR రికార్డు బద్దలుగొట్టిన ఆయుష్మాన్

అయితే తాజాగా నిర్వహించిన ప్లేస్ మెంట్స్ లో ఆయుష్మాన్ కు కల్లుచెదిరే సాలరీలో జాబ్ ఆఫర్ చేసింది యూఎస్ బేస్డ్ మల్టీనేషనల్ కంపనీ. అతడి టాలెంట్ కు ఫిదా అయిన కంపనీ ప్రతినిధులు ఏడాదికి రూ.1.20 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసారు. ఇది IIT-NR చరిత్రలోనే అత్యధిక సాలరీ ప్యాకేజ్ గా తెలుస్తోంది. గతంలో రాశి బగ్గా అనే ఐఐఐటి విద్యార్థిని ఏడాదికి రూ.85 లక్షల సాలరీతో ఉద్యోగాన్ని పొందింది... ఇప్పుడు ఆ రికార్డును ఆయుష్మాన్ బద్దలుగొట్టాడు.

45
IIIT-NR విద్యార్థులకు బంపరాఫర్

ఈసారి 60 మందికిపైగా తమ విద్యార్థులు భారీ సాలరీలతో ఉద్యోగాలు పొందారని IIIT-NR ప్లేస్ మెంట్ ఇంచార్జ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ఇక్కడ బిటెక్, ఎంటెక్ చదివే విద్యార్థులను ప్రముఖ కంపనీలు ఎంపిక చేసుకున్నాయని తెలిపారు. యావరేజ్ రూ.18.90 లక్షల సాలరీతో తమ విద్యార్ధులు ఉద్యోగాలు పొందారని అమిత్ అగర్వాల్ తెలిపారు.

55
ఆయుష్మాన్... యువతకు ఆదర్శం

కేవలం ఏ ఇండిమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) లలో చదివిన విద్యార్థులకు మాత్రమే కోట్ల రూపాయల సాలరీతో ఉద్యోగాలు వస్తాయని ఇంతకాలం భావించేవారు. ఈ భ్రమను ఆయుష్మాన్ తొలగించాడు... సాధారణ విద్యాసంస్థల్లో చదివినా ఉన్నత ఉద్యోగాలు సాధించగలమని నిరూపించాడు. కష్టపడి చదివితే ఎవరైనా ఉన్నతస్థాయికి చేరుకోగలిరు అనడానికి ఆయుష్మాన్ ఉదాహరణ. అతడు నేటి యువతరానికి ఆదర్శం.

Read more Photos on
click me!

Recommended Stories