Worship Of Toilets: టాయిలెట్స్‌ను పూజించే వింత ఆచారం.. ఎక్క‌డ‌, ఈ ట్రెడిష‌న్ ఎందుకొచ్చింది.

Published : Apr 02, 2026, 02:23 PM IST

Worship Of Toilets: ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని సంప్రదాయాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మరికొన్ని మన ఆలోచనలకు కూడా అందవు. అలాంటి ఓ వింత ఆచారం గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
చైనాలో కనిపించే వింత సంప్రదాయం

చైనాలోని కొన్ని దూర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఒక పండుగ సమయంలో టాయిలెట్ పూజ చేసే ఆచారం కనిపిస్తుంది. సాధారణంగా మనం దేవాలయాల్లో లేదా ఇంటి పూజా గదిలో పూజ చేస్తాం. కానీ అక్కడ మహిళలు టాయిలెట్ దగ్గరికి వెళ్లి పూజలు చేస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతున్నట్లు అక్కడి ప్రజలు చెబుతారు. దీనిని వారు విచిత్రంగా కాకుండా తమ విశ్వాసంగా భావిస్తారు.

25
లాంతర్న్ ఫెస్టివల్ రోజున జరిగే పూజ

ఈ పూజ ముఖ్యంగా లాంతర్న్ ఫెస్టివల్ (Lantern Festival) సమయంలో జరుగుతుంది. చైనా లూనర్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలో 15వ రోజు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు మహిళలు చేతుల్లో అగరబత్తులు తీసుకుని టాయిలెట్ వద్దకు వెళ్తారు. అక్కడ టాయిలెట్ ముందు నిలబడి దేవతను ప్రార్థిస్తారు. ఈ పూజను జిగు దేవి (Zigu Goddess) పూజగా పరిగణిస్తారు. ఆమెను కొందరు టాయిలెట్ దేవతగా కూడా పిలుస్తారు.

35
పూజ చేసే విధానం ఎలా ఉంటుంది?

ఈ పూజలో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ముందుగా మహిళలు టాయిలెట్‌ను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఒక చిన్న బొమ్మ లేదా పుత్తడి బొమ్మను ఉంచుతారు. తర్వాత అగరబత్తులు వెలిగించి దేవిని ప్రార్థిస్తారు. ఈ సమయంలో మహిళలు తమ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు వ్యవసాయం ఎలా ఉంటుంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? అని ప్రశ్నలు అడుగుతారు. పూజ సమయంలో ఆ బొమ్మ కొంచెం కదిలితే దాన్ని దేవి ఇచ్చిన సంకేతంగా భావిస్తారు.

45
జిగు దేవి ఎవరు?

ఈ సంప్రదాయం వెనుక ఒక పురాతన కథ ఉంది. జిగు అనే మహిళ చాలా కాలం క్రితం జీవించింది. ఆమె చాలా అందంగా ఉండేదని చెబుతారు. ఆమె ఒక ధనవంతుడి ఇంట్లో ఉండేది. అయితే ఆ వ్యక్తి భార్యకు జిగుపై అసూయ ఎక్కువగా ఉండేది. ఒక రోజు కోపంతో ఆమె జిగును హత్య చేసి, ఆమె శవాన్ని టాయిలెట్ దగ్గర పడేసిందని కథ చెబుతుంది.

55
మహిళల రక్షక దేవతగా మారిన జిగు

ఆ సంఘటన తర్వాత జిగు ఆత్మ అక్కడే ఉందని ప్రజలు నమ్మడం ప్రారంభించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆమెను దేవతగా భావించి పూజలు చేయడం మొదలైంది. కాలక్రమంలో జిగును మహిళలకు సహాయం చేసే దేవతగా పరిగణించారు. కుటుంబానికి శుభం, శాంతి కలుగుతాయని కూడా విశ్వసిస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జిగు దేవిని టాయిలెట్ వద్ద పూజించే సంప్రదాయం కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories