జంతువులు సాక్ష్యం చెప్పడం ఎప్పుడైనా చూశారా.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. ఓ చిలుక చెప్పిన సాక్ష్యాన్ని ప్రామాణికంగా తీసుకున్న కోర్టు వ్యక్తికి జైలు శిక్ష విధించింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కువైట్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి మని మనిషితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యను మోసం చేస్తూ ఈ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. గుట్టు చప్పుడు కాకుండా మనోడు వ్యవహారం సాగించాడు. అయితే ఓ చిలుక కారణంగా మనోడి అసలు రూపం బయటపడింది.
25
భార్యకు మొదలైన అనుమానం
అయితే కొన్ని రోజులుగా భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. అయితే దానిని రుజువు చేయలేకపోయింది. ఏదైనా సాక్ష్యం లేకుండా భర్తను ప్రశ్నిస్తే, వారి సంబంధం చెడిపోతుందనే భయంతో ఆమె నిశ్శబ్దంగా ఉండేది.
35
చిలుక ఇచ్చిన సంకేతం
అయితే ఆ కుటుంబం ఇంట్లో ఓ చిలుకను పెంచుకుంటోంది. మాట్లాడే సామర్థ్యం ఉన్న ఆ చిలుక పదే పదే ఇంటి పని మనిషి పేరు పలకడం మొదలుపెట్టింది. మొదట ఇది పెద్దగా గుర్తించని భార్య, తరువాత తరచుగా అదే పేరు పలకడంతో ఆశ్చర్యపోయింది. దీంతో భర్తపై ఉన్న అనుమానం మరింత బలపడింది.
ఒక రోజు భార్య సాధారణానికి ముందే ఇంటికి రావడంతో నిజం బయటపడింది. భర్త పనిమనిషితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వెంటనే భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు కోర్టులోకి వెళ్లింది. విచారణలో చిలుక చెప్పిన విషయాలను కూడా సాక్ష్యంగా పరిగణించారు.
55
కోర్టు తీర్పు
చివరికి భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రుజువు కావడంతో అతనికి జైలు శిక్ష విధించారు. ఇదిలా ఉంటే ఈ సంఘటన తాజాగా జరిగింది కాదు. కొన్నేళ్ల క్రితం కువైట్‌లో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.