US Shutdown: ష‌ట్‌డౌన్‌లోకి అమెరికా.. అస‌లేంటీది.? భార‌తీయుల‌పై ప‌డే ప్ర‌భావం ఏంటి.?

Published : Oct 01, 2025, 11:46 AM IST

US Shutdown: అమెరికా ప్ర‌భుత్వం ష‌ట్‌డౌన్‌లోకి వెళ్లింది. కీల‌క బిల్లుల‌కు ఆమోదం ల‌భించ‌క‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత అమెరికాలో ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. ఇంత‌కీ ష‌ట్‌డౌన్ అంటే ఏంటి? దీని ప్ర‌భావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఎలా మొదలైంది?

అమెరికాలో దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఫెడరల్‌ గవర్నమెంట్‌ అధికారికంగా షట్‌డౌన్‌లోకి వెళ్లింది. దీనికి కారణం సెనేట్‌లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విభేదాలు. ఆరోగ్య సబ్సిడీలపై రాయితీలు ఇవ్వాలని డెమోక్రాట్లు పట్టుబడగా, రిపబ్లికన్లు "క్లీన్‌ బిల్లే" ఆమోదించాలని కోరారు. దీంతో నిధుల బిల్లుకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో షట్‌డౌన్‌ తప్పలేదు.

25
ఎంతమంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది.?

కాంగ్రెస్‌ బడ్జెట్‌ కార్యాలయం అంచనా ప్రకారం, ఈ షట్‌డౌన్‌ వల్ల సుమారు 7.5 లక్షల ఫెడరల్‌ ఉద్యోగులు పనికి వెళ్లకుండా ఉండాలి లేదా జీతం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. రోజుకు సుమారు 400 మిలియన్‌ డాలర్ల వేతన నష్టం జరుగుతుందని చెబుతున్నారు. గతంలో 2013లో జరిగిన షట్‌డౌన్‌లో 8.5 లక్షల ఉద్యోగులు ప్రభావితమయ్యారు.

35
ఎలాంటి సేవలు కొనసాగుతాయి?

అయితే దీనివ‌ల్ల ప్రభుత్వం పూర్తిగా ఆగిపోదు. అత్యవసరమైన పనులు మాత్రం కొనసాగుతాయి. ఉదాహరణకు – NASA అంతరిక్ష మిషన్లు, ఇమ్మిగ్రేషన్‌ అమలు, FDA, USDAలోని కొంత ప్రజా ఆరోగ్య కార్యకలాపాలు. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, పోలీస్‌ శాఖ, సోషల్‌ సెక్యూరిటీ వంటివి కూడా యథావిధిగా నడుస్తాయి. అయితే పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్‌, నేషనల్‌ పార్కులు, రెగ్యులేటరీ ఇన్‌స్పెక్షన్లు నిలిచిపోతాయి.

45
రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ

డెమోక్రాట్లు ఆరోగ్య బీమా సబ్సిడీల కొనసాగింపుపై పట్టుబడుతుంటే, రిపబ్లికన్లు ఈ అంశాలు వేరుగా చర్చించాలంటున్నారు. ఈ స్థితిలో తాత్కాలిక నిధుల బిల్లును ఆమోదించేందుకు ఇరువర్గాలు రాజీ పడలేదు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం “షట్‌డౌన్‌ వల్ల డెమోక్రాట్లకు ఇష్టమైన పథకాలను తగ్గించే అవకాశం ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.

55
జ‌రిగే న‌ష్టం ఏంటి.?

అత్యవసర సేవలు కొనసాగినా, సాధారణ ప్రజలకూ, ఉద్యోగులకూ ఇబ్బందులు తప్పవు. పాస్‌పోర్ట్ దరఖాస్తులు ఆలస్యమవుతాయి. జాతీయ పార్కులు మూతబడతాయి. FDA, EPA ఇన్‌స్పెక్షన్లు నిలిచిపోవడంతో పలు పరిశ్రమలకు ఆటంకాలు వస్తాయి. సోషల్‌ సెక్యూరిటీ, మెడికేర్, మెడికెయిడ్‌ వంటి పథకాలు కొనసాగినా, వాటి సపోర్ట్‌ సేవలు ఆలస్యం కావచ్చు. దీర్ఘకాలిక షట్‌డౌన్‌ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. 2018–19లో జరిగిన షట్‌డౌన్‌ GDPలో 3 బిలియన్‌ డాలర్ల నష్టం కలిగించింది. ప్రత్యేకంగా భారతీయులపై ఎలాంటి ప్రభావం పడకపోయినా అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. 

Read more Photos on
click me!

Recommended Stories