అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) తాజాగా రూపొందించిన ప్రతిపాదనల్లో 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలకు చోటు కల్పించింది. భారత్, చైనా, బంగ్లాదేశ్, కంబోడియా, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయ్లాండ్, వియత్నాంపై కొత్తగా సుంకాలు విధించాలని భావిస్తోంది. ఇదే సమయంలో గతంలో పరిశీలనలో ఉన్న మెక్సికో, నార్వే దేశాలను తాజా జాబితా నుంచి తప్పించింది. ఈ దేశాల వాణిజ్య విధానాలు అమెరికా తయారీ రంగానికి నష్టం కలిగిస్తున్నాయన్నది ట్రంప్ ప్రభుత్వం ప్రధాన ఆరోపణ.