Neal Katyal : ట్రంప్ కే చుక్కలు చూపిస్తున్న భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్..?

Published : Feb 21, 2026, 01:14 PM IST

Neal Katyal : అమెరికా ప్రభుత్వం ప్రపంచ దేశాలపై విధించిన టారీఫ్స్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడం ఓ భారత సంతతి న్యాయవాది కీలకంగా పనిచేశారు. ఆయన ఎవరు..? సుప్రీంకోర్టులో టారీఫ్స్ కు వ్యతిరేకంగగా ఎలా వాదించారు?  

PREV
15
ట్రంప్ టారీఫ్స్ రద్దు వెనక భారత సంతతి న్యాయవాది..

Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి వ్యక్తో యావత్ ప్రపంచానికి తెలుసు. అతడు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో అందరం చూస్తూనే ఉన్నాం... చివరకు ఓ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి బంధించాడు... మరికొన్ని దేశాలను ఆక్రమించే పనిలో ఉన్నాడు. మరీముఖ్యంగా వాణిజ్యపరంగా అతడు తీసుకున్న నిర్ణయాలు అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తనకు నచ్చని దేశాలపై 100-200 శాతం టారీఫ్స్ విధించాడు. ఇలా నియంతలా వ్యవహరిస్తున్న ట్రంప్ తో పెట్టుకునేందుకు దేశాధినేతలే జంకుతున్నారు .. అలాంటిది ఓ భారతీయ అమెరికన్ మాత్రం అతడికి చుక్కలు చూపిస్తున్నాడు.

ట్రంప్ వివిధ దేశాలపై విధించిన టారీఫ్స్ ను సుప్రీం కోర్టు తాజాగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెనకున్నది భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్. ట్రంప్ టారీఫ్స్ కు వ్యతిరేకంగా అతడి బలమైన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

25
ట్రంప్ టారీఫ్స్ కి వ్యతిరేకంగా నీల్ కత్యాల్ వాదన...

ట్రంప్ విధించిన భారీ టారీఫ్స్ ను వ్యతిరేకిస్తూ చిరు వ్యాపారులు, ప్రతిపక్ష డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీరి తరపునే ప్రముఖ అమెరికన్ న్యాయవాది నీల్ కత్యాల్ వాదించారు. ఈయన బరాక్ ఒబామా హయాంలో అమెరికా యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ గా వ్యవహరించారు.

1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA)ను అడ్డం పెట్టుకుని అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అన్యాయంగా, రాజ్యాంగ విరుద్ధంగా పన్నులు వేస్తున్నారని కత్యాల్ యూఎస్ సుప్రీంకోర్టులో బలంగా వాదించారు. ఇలా ట్రంప్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన కత్యాల్ చివరకు టారీఫ్స్ నిర్ణయాలు చెల్లకుండా చేశారు.

35
ఎవరీ నీల్ కత్యాల్..?

భారత్ నుండి అమెరికాకు వలసవెళ్లిన ఇంజనీర్ సురేందర్, వైద్యురాలు ప్రతిభ దంపతులకు 1970, మార్చి 12న నీల్ కత్యాల్ జన్మించారు. ఇల్లినాయిస్ విల్మెట్ లోని జెస్యూట్ కాథలిక్ స్కూల్లో చదువుకున్నారు. డార్ట్‌మౌత్ కాలేజ్, యేల్ లా స్కూల్ నుంచి పట్టభద్రులయ్యారు. అనంతరం న్యాయవాద వృత్తిలోకి వచ్చారు.

45
న్యాయవాదిగా నీల్ ప్రయాణం..

యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ వద్ద క్లర్క్‌గా పనిచేశారు నీల్. 2010లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన్ను యాక్టింగ్ సొలిసిటర్ జనరల్‌గా నియమించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో, దేశవ్యాప్తంగా అప్పీల్ కోర్టులలో ఫెడరల్ ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించారు. సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులు వాదించి రికార్డు సృష్టించారు.

ప్రస్తుతం మిల్క్‌బ్యాంక్ ఎల్‌ఎల్‌పిలో భాగస్వామిగా, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ లా సెంటర్‌లో పాల్ సాండర్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. రాజ్యాంగపరమైన, సంక్లిష్టమైన అప్పీల్ కేసుల్లో ఆయన నిపుణులు. 1965 ఓటింగ్ హక్కుల చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించడం, ట్రంప్ 2017 ట్రావెల్ బ్యాన్‌ను సవాల్ చేయడం, కీలకమైన పర్యావరణ, జాతీయ భద్రతా వివాదాల్లో విజయం సాధించడం వంటివి ఆయన వాదించిన గతంలోని ముఖ్యమైన కేసుల్లో కొన్ని.

55
ట్రంప్ టారీఫ్స్ రద్దు తీర్పుపై నీల్ కామెంట్స్...

సుప్రీంకోర్టు యూఎస్ ప్రభుత్వం విధించిన టారీఫ్స్ ను రద్దు చేయడంపై నీల్ కత్యాల్ స్పందించారు. "యూఎస్ సుప్రీంకోర్టు చట్టబద్ధ పాలనను నిలబెట్టింది. ఈ తీర్పు సందేశం చాలా సులభం... అధ్యక్షులు శక్తిమంతులే కావచ్చు, కానీ మన రాజ్యాంగం అంతకంటే శక్తిమంతమైనది. అమెరికాలో ప్రజలపై పన్నులు వేసే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది" అని అన్నారు.

ఈ తీర్పును ఒక రాజ్యాంగ మైలురాయిగా అభివర్ణించారు. "చట్టపరంగా మేము కోరినవన్నీ యూఎస్ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఈ కేసు ఏ ఒక్క అధ్యక్షుడికీ వ్యతిరేకం కాదు, అధ్యక్ష పదవికి సంబంధించింది. ఇది అధికారాల విభజనను బలపరుస్తుంది. 250 ఏళ్లుగా మన ప్రభుత్వానికి మూలస్తంభంగా ఉన్న సుప్రీంకోర్టు, మన ప్రాథమిక విలువలను కాపాడటం చూడటం నాకు సంతోషంగా ఉంది" అని కత్యాల్ చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories