BM-21 Grad: అస‌లేంటీ BM-21 రాకెట్? థాయ్‌లాండ్‌-కాంబోడియాలో ఏం జ‌రుగుతోంది.?

Published : Jul 28, 2025, 02:47 PM IST

థాయ్‌లాండ్, కాంబోడియా సరిహద్దులో భారీ యుద్ధ వాతావరణం నెలకొన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా కాంబోడియా సైన్యం BM-21 గ్రాడ్ రాకెట్ లాంచర్లు ఉపయోగించిందని థాయ్ దళాలు ఆరోపిస్తున్నాయి. దీంతో అస‌లేంటీ BM-21 అన్న విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. 

PREV
15
BM-21 వినియోగంపై ఆరోపణలు

జూలై 24న థాయ్‌లాండ్‌, కాంబోడియాల మధ్య దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రంగా సైనిక పోరు జరిగింది. వివాదాస్పద ప్రాంతంపై ట్యాంకులు, ఆర్టిలరీతో భీక‌ర పోరాటానికి దిగారు. ఈ ఘ‌ర్ఘ‌ణ‌లో సుమారు 12 మంది వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ట్లు చెబుతున్నారు. కాగా థాయ్ సైన్యం ప్రకారం కాంబోడియా BM-21 గ్రాడ్ రాకెట్ సిస్టమ్‌ను ఉపయోగించిందని ఆరోపిస్తోంది.

25
బ‌య‌ట‌ప‌డ్డ ఫొటోలు

ఈ రాకెట్‌కు సంబంధించిన ఫొటోలు జూలై 25వ తేదీన వెలుగులోకి వ‌చ్చాయి. వాటిలో కాంబోడియా సైనికులు BM-21 గ్రాడ్ రాకెట్ సిస్టమ్ అమర్చిన ట్రక్ పై కనిపించారు. ఈ దృశ్యాలు ఆడ‌ర్ మినాచీ అనే ప్రావిన్స్‌లో తీసినవనిగా చెబుతున్నారు. ఈ ఫొటోలు బయటపడటంతో థాయ్‌లాండ్ ఆర్మీ ప్రతిస్పందనగా మ‌రింత తీవ్రంగా దాడి చేసింద‌ని తెలిపింది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కింద‌ని చెప్పాలి.

35
అస‌లేంటీ BM-21 గ్రాడ్ రాకెట్.?

BM-21 గ్రాడ్ రష్యా (మాజీ సోవియట్ యూనియన్) 1960 దశకంలో తయారు చేసిన ట్రక్-మౌంటెడ్ రాకెట్ లాంచర్. BM అంటే “కాంబాట్ వెహికల్” (యుద్ధ వాహనం), Grad అంటే “Hail” (మంచు వర్షం) అని అర్థం. నాటో దానికి M1964 అనే కోడ్ నేమ్‌ ఇచ్చింది. ఈరోజు కూడా అనేక దేశాలు ఇదే రకం లాంచర్‌ను వాడుతున్నాయి.

45
దీని ప్ర‌త్యేక‌తలు ఏంటంటే.?

BM-21 ఒక్కసారిగా 40 రాకెట్లను కేవలం 6 సెకండ్లలో ప్రయోగించగలదు. ఒక్కొక్కటిగా కూడా కాల్చవచ్చు. ట్రక్ వెనక భాగంలో అమ‌ర్చిన ఈ వ్య‌వ‌స్థ‌ను వాహనం లోపల నుంచీ లేదా లాంగ్ వైర్ ద్వారా బయట నుంచీ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఒక్కసారి ప్రయోగించిన తర్వాత సుమారు 10 నిమిషాల్లో తిరిగి రీలోడ్ చేసుకోవ‌చ్చు. ఈ వేగం, దాడి శక్తి యుద్ధ భూమిపై భారీ వినాశ‌నాన్ని సృష్టిస్తుంది.

55
భ‌యం ఎందుకు.?

BM-21 గ్రాడ్ ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే రాకెట్ లాంచర్. ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికా దేశాలన్నింటికీ దీని ఎగుమ‌తి జ‌రిగింది. అనేక దేశాలు తమ స్వంత వెర్షన్లను కూడా రూపొందించాయి. అందుకే ఈ రాకెట్ సరిహద్దు ఘర్షణలో కనిపిస్తే, అది కేవలం థాయ్‌లాండ్, కాంబోడియాలకే కాదు. ఇత‌ర దేశాల‌కు కూడా ఆందోళ‌న క‌లిగించే అంశంగా చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories