హజ్ యాత్ర:
హజ్ యాత్ర దగ్గరపడుతుండటంతో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో సహా 14 దేశాల ప్రజలకు కొన్ని వీసాలు ఇవ్వడం తాత్కాలికంగా ఆపేసింది. దీని ప్రకారం, హజ్ యాత్ర పూర్తయ్యే జూన్ నెల మధ్య వరకు ఉమ్రా, వ్యాపారం, కుటుంబ సందర్శన వీసాలకు బ్రేక్ ఉంటుంది.
ఈ బ్రేక్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్, మొరాకోతో సహా 14 దేశాల నుంచి వచ్చేవాళ్లకు వర్తిస్తుంది. హజ్ 2025 సీజన్ జూన్ 4-9 వరకు ప్లాన్ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.