టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏఐ టెక్నాలజీ వాడకం పెరుగుతోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరిగింది. ఈ క్రమంలోనే అబుదాదిని ప్రపంచంలోనే తొలి ఏఐ సిటీగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో రెండేళ్లలోనే దీనిని సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఏఐ పట్టణం కోసం 3.3 మిలియన్ డాలర్లను అబుదాబి గవర్నమెంట్ కేటాయించింది. 2027 నాటికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచడానికి ప్లాన్ చేస్తోంది.
AI ప్రాజెక్ట్ కింద AI ట్రైనింగ్
ఇందులో భాగంగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ ప్రాజెక్ట్ లో భాగంగా పౌరులందరికీ ఏఐ ట్రైనింగ్ ఇవ్వడంపై అబుదాబి ప్రభుత్వం ఫోకస్ పెంచింది.
అహ్మద్ అల్ కుట్టాబ్ - AI టెక్నాలజీ
గవర్నమెంట్ DNAలో AIని కలపడం ద్వారా ప్రజల కోసం పబ్లిక్ సర్వీస్ డెలివరీని మారుస్తామని డిజిటల్ ప్రభుత్వ సంస్థ (DGE) ఛైర్మన్ అహ్మద్ హిషామ్ అల్ కుట్టాబ్ తెలిపారు. తమ ప్రభుత్వాన్ని AI-సామర్థ్యంతో తీర్చిదిద్దుతూ, క్లౌడ్ టెక్నాలజీలను, డేటా ఆధారిత నిర్ణయాలను ప్రభుత్వం లో భాగంగా మార్చుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. దీని ద్వారా ప్రభుత్వ సేవల రూపాన్ని మార్చడంతో పాటు, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయగలుగుతామని ఆయన అన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - AI-పవర్డ్ సర్వీస్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ గవర్నమెంట్ డిజిటల్ స్ట్రాటజీని సుమారు 10 ఏళ్ల క్రితం నుంచే అమలు చేస్తోంది. డిజిటల్ ఎవల్యూషన్‌పై దృష్టి సారించింది.
AI డెవలప్‌మెంట్
అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం పెంచడంతో పాటు. ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, AI పరిశోధన, అభివృద్ధిలో అగ్రగామిగా మారేందుకు అబుదాబి ప్రభుత్వం ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది. ఇందులో మొహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (MBZUAI), అడ్వాన్స్డ్ టెక్నాలజీ రీసెర్చ్ కౌన్సిల్ (ATRC) వంటి సంస్థలు ఉన్నాయి. ఇవి తాజా AI పరిశోధనలు, సాంకేతికతలను UAEలో ప్రవేశపెట్టేందుకు కీలకంగా మారనున్నాయి.