Donald Trump: ట్రంప్‌ దెబ్బ అమెరికన్లు అబ్బా.. టాయిలెట్ పేపర్లకు తప్పని తిప్పలు

అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చాడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే అమెరికాకు మేలు చేసే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ట్రంప్‌. అయితే ఇదే సమయంలో ట్రంప్‌ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అమెరికా ప్రజల ప్రజల ప్రయోజనాలు సైతం దెబ్బ తీస్తున్నాయా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 

Donald Trump Tariffs US Faces Price Hike on Toilet Paper details in telugu VNR
Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన టారిఫ్‌ పెంపునకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌ యుద్ధం చేస్తున్నారు. భారత్‌ అత్యధిక సుంకాలను వసూలు చేస్తుందని, తాము కూడా అదే విధానాన్ని పాటిస్తామని స్వీట్‌ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కెనడాపై విధిస్తోన్న సుంకాలు అమెరికాపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. 

Donald Trump Tariffs US Faces Price Hike on Toilet Paper details in telugu VNR
US President Donald Trump (Image Credit: US Network Pool via Reuters)

కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సాఫ్ట్‌వుడ్‌ ఉత్పత్తులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించనున్నాయి. చివరికి టాయిలెట్‌ పేపర్‌ వంటి రోజువారీ అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. కెనడా నుంచి దిగుమతి అయ్యే కలపై సుంకాలను పెంచేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 2 నుంచి ట్రంప్‌ కొత్త టారిఫ్‌ పెంపును అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెనడా కలపపై 14% టారిఫ్‌ వసూలు చేస్తుండగా, దీనిని 27%కి పెంచనున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ పెంపు కారణంగా పేపర్ ఉత్పత్తుల ధరలు 50% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 


US President Donald Trump (Image Credit: X@RapidResponse47)

అమెరికా పేపర్‌ మిల్లులు ప్రధానంగా కెనడా కలపపైనే ఆధారపడతాయి. అమెరికాలో వినియోగించే టాయిలెట్‌ పేపర్‌లో 30 శాతం, పేపర్ టవళ్లలో సగం వాటా ఈ కలపదే కావడం విశేషం. ఒకవేళ సుంకాలు పెంచితే సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. గతేడాది అమెరికా దాదాపు 20 లక్షల టన్నుల ఎన్‌బీఎస్‌కే (Northern Bleached Softwood Kraft) కలప గుజ్జును దిగుమతి చేసుకుంది. కొత్త సుంకాల వల్ల ఈ సరఫరా తక్కువై, ఆయా ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, అమెరికా వినియోగదారులకు ఇది ఆర్థిక భారం పెంచే అంశమవుతుందని చెబుతున్నారు. మరి ట్రంప్‌ ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తారా.? మరేదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచిస్తారా.? చూడాలి. 
 

US President Donald Trump

వాహన దిగుమతులపై కూడా..

ఇదిలా ఉంటే వాహన దిగుమతులపై కూడా 25% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో దేశీయ తయారీ వేగవంతం అవుతుందని ట్రంప్‌ భావిస్తున్నారు. విడిభాగాలు, తయారీ కోసం అంతర్జాతీయ సరఫరాపై ఆధారపడ్డ అమెరికా వాహన కంపెనీలకు తాజా పరిణామం ఆర్థిక భారమే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అమెరికాలో వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ట్రంప్‌ తెలిపారు. ఇదిలా ఉంటే భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లే దాదాపు 7 బిలియన్‌ డాలర్ల విలువైన వాహన విడిభాగాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Latest Videos

vuukle one pixel image
click me!