Husband For Hour: ఈ అందమైన అమ్మాయిలకు పురుషులు దొరకడం లేదంటా.. అద్దెకు భర్తలను తీసుకుంటున్నారు

Published : Dec 05, 2025, 01:24 PM IST

Husband For Hour: సాధారణంగా అబ్బాయిలకు సరిపడ అమ్మాయిలు దొరకడం లేరనే వార్తలు విని ఉంటాం. కానీ ఓ దేశంలో మాత్రం దీనికి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. అందమైన అమ్మాయిలకు అబ్బాయిలు దొరకడం లేదు. ఇంతకీ ఏంటా దేశం.? అస‌లు క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
యూరప్‌లోనే ఎక్కువ మహిళలు ఉన్న దేశం

యూరోస్టాట్ తాజా రిపోర్ట్ ప్రకారం, లాత్వియాలో పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువ. ఇది యూరోప్ యూనియన్ సగటుతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. అంతేకాకుండా ఇక్క‌డి మ‌హిళ‌లు అందానికి పెట్ఇంది పేరు. అయితే వీరికి స‌రిప‌డ పురుషులు మాత్రం లేరంటా. 65 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఈ వ్యత్యాసం మరింత తీవ్రంగా మారుతుంది. ఆ వయస్సు గల మహిళలు పురుషుల కంటే రెట్టింపు సంఖ్యలో ఉన్నారని World Atlas తెలిపింది.

25
మహిళలకు స్నేహితులు, భాగస్వాములు దొరకక ఇబ్బంది

ఈ మగవారి కొరత కారణంగా లాత్వియాలో యువతులు, ఉద్యోగస్తులు భాగస్వాములు దొరకడంలో ఇబ్బంది పడుతున్నారు. ఒక పండుగల నిర్వాహకురాలు డేనియా చెబుతూ.. “మా టీమ్‌లో 98% మహిళలే. మాట్లాడటానికి, ఫ్లర్ట్ చేయడానికి పురుషులు ఉంటే కొంచెం బ్యాలెన్స్‌గా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది. ఆమె స్నేహితురాలు జానే మాట్లాడుతూ.. “అందుకే మా స్నేహితుల్లో చాలామంది విదేశాలకు వెళ్లి అక్కడే బాయ్‌ఫ్రెండ్స్‌ను కలుసుకుంటున్నారు” అని చెప్పింది.

35
‘ఒక గంట భర్త’.. పనుల కోసం అద్దెకు భర్తలు

మగవారి కొరత పెరగడంతో, అనేక మహిళలు ఇంటి పనుల కోసం ప్రత్యేక సేవలకు మొగ్గుచూపుతున్నారు. Komanda24 వంటి ప్లాట్‌ఫార్మ్‌లు “Men With Golden Hands” పేరుతో పురుషులను పంపిస్తున్నారు. వీరు ప్లంబింగ్, కార్పెంట్రీ, చిన్న చిన్న రిపేర్ పనులు, టీవీ మౌంటింగ్, లాంటివి కొద్దిపాటి ఛార్జ్ చేస్తారు. అలాగే Remontdarbi.lv అనే సర్వీస్‌లో ‘Husband for an Hour’ అని ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో బుక్ చేస్తే, ఒక గంటలో ఇంటికి వచ్చి పని చేస్తారు. వీళ్లు గోడల పెయింటింగ్, కర్టెన్లు ఫిక్స్ చేయడం, చిన్న చిన్న మెకానికల్ పనులు ఇలా అనేక పనులు చేస్తారు.

45
లాత్వియాలో మగవారి కొరత ఎందుకు తలెత్తింది?

నిపుణుల ప్రకారం, దేశంలో పురుషుల జీవితకాలం మహిళలతో పోలిస్తే గణనీయంగా తక్కువ. దీనికి ప్ర‌ధాన కార‌ణాలు ఇలా ఉన్నాయి..

* పురుషుల్లో ధూమపానం మూడు రెట్లు ఎక్కువ (31% పురుషులు, మహిళల్లో 10%) ఉంది.

* అధిక బరువు, ఒబేసిటీ సమస్య ఎక్కువగా ఉంది.

* ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ ఉండ‌డం వంటి కారణాలతో పురుషుల సంఖ్య సంవత్సరాలుగా తగ్గుతోంది.

55
ఈ ట్రెండ్ ఇతర దేశాల్లోనూ వ్యాపిస్తోంది

ఇది లాత్వియాలో మాత్రమే కాదు. 2022లో బ్రిటన్‌కు చెందిన లారా యంగ్ అనే మహిళ తన భర్త జేమ్స్‌ను “Rent My Handy Husband” పేరుతో ఇతరులకు పనులకు పంపుతూ వైరల్ అయింది. జేమ్స్‌.. పెయింటింగ్, టైల్ వర్క్, కార్పెట్ లేయింగ్, రిపేర్ పనులు వంటివి చేస్తాడు. అతని ఛార్జీలు గంటకు $44, ఓ రోజు మొత్తం $280 (మ‌న క‌ర్సెన్సీలో చెప్పాలంటే రూ. 26 వేలు). నవంబర్ మొత్తం బుకింగ్స్‌తో నిండిపోవడంతో పనులను రిజ‌క్ట్ చేయాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories