ప్రపంచం ఇంకా పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడుతుండగా… ఐస్‌లాండ్ మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ వాహనాల వైపు వేగంగా మారుతోంది. భవిష్యత్తులో పూర్తిగా ఫ్యూయల్ ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేవలం ఐస్‌లాండ్ మాత్రమే కాకుండా నార్వే, స్వీడన్, పరాగ్వే, కోస్టారికా లాంటి దేశాలు కూడా ఎక్కువగా రిన్యూవబుల్ ఎనర్జీనే ఉపయోగిస్తున్నాయి.
మొత్తంమీద ప్రపంచం మొత్తం ఆయిల్‌పై ఆధారపడుతున్న ఈ కాలంలో… ఐస్‌లాండ్ చూపిస్తున్న మార్గం చాలా ముఖ్యమైనది. ప్రకృతి వనరులను సరిగ్గా వినియోగిస్తే ఇంధన సమస్యలు తగ్గుతాయి, ఖర్చులు తగ్గుతాయి, పర్యావరణం కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఈ మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది.