మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేరు బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన చదువు, రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఏం చేసేవారనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.
ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఎక్కువ కాలం చక్రం తిప్పిన నేత ఎవరైనా ఉన్నారంటే అది బెంజమిన్ నెతన్యాహునే. ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా 'బీబీ' అనే ముద్దుపేరుతో కూడా పిలుస్తారు. నెతన్యాహు ఇజ్రాయెల్‌లో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా గుర్తింపు పొందారు. అంతేకాదు నెతన్యాహు రాజకీయ పునరాగమనం కూడా చాలా ప్రత్యేకమైనది.
25
నెతన్యాహు పొలిటికల్ కెరీర్
నెతన్యాహు మొదటిసారి 1996 జూన్‌లో ఇజ్రాయెల్ ప్రధాని అయ్యారు. ఈ దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆయన మొదటి పదవీకాలం 1999 వరకు కొనసాగింది.
మధ్యలో అధికారాన్ని కోల్పోయిన నెతన్యాహు తిరిగి 2009లో మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టాడు. 2021 జూన్ వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. మధ్యలో చిన్న విరామం వచ్చినా డిసెంబర్ 2022లో మళ్లీ పీఎం కుర్చీని దక్కించుకున్నారు… ప్రస్తుతం ఈ పదవిలోనే కొనసాగుతున్నారు. ఇలా ఇజ్రాయెల్‌లో సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు సృష్టించారు నెతన్యాహు.
35
స్పెషల్ ఫోర్స్‌లో పనిచేసిన నెతన్యాహు
1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత జన్మించిన తొలి ప్రధానులలో నెతన్యాహు ఒకరు… 1949 లో రాజధాని టెల్ అవీన్ లో జన్మించారు. అందుకే ఆయన ఆలోచనలు, రాజకీయాల్లో కొత్త తరం దృక్పథం కనిపిస్తుంది.
రాజకీయాల్లోకి రాకముందు నెతన్యాహు ఇజ్రాయెల్ అత్యంత ప్రమాదకరమైన స్పెషల్ ఫోర్స్ యూనిట్ 'సయెరెట్ మత్కల్' (Sayeret Matkal)లో పనిచేశారు. అత్యంత క్లిష్టమైన మిషన్లకు ఈ యూనిట్ పెట్టింది పేరు. ఇది ఆయన బలమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.
నెతన్యాహు అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చదువుకున్నారు. అక్కడ ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీలు పొందారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వంటి పెద్ద అంతర్జాతీయ కంపెనీలో కూడా పనిచేశారు.
నెతన్యాహు తన అనర్గళమైన ఇంగ్లీష్, పదునైన ప్రసంగాలకు ప్రసిద్ధి. ఐక్యరాజ్యసమితిలో చాలాసార్లు ఇజ్రాయెల్ వాదనను ఆయన బలంగా వినిపించారు. ఆయన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతాయి.
55
టెల్ అవీవ్‌లో మొదలైన ప్రస్థానం..
నెతన్యాహు ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరం టెల్ అవీవ్‌లో జన్మించారు. ఇక్కడి నుంచే ఆయన ప్రస్థానం మొదలై, దేశ రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఆయన అన్న యోనాతన్ నెతన్యాహు 1976లో జరిగిన చరిత్రాత్మక సైనిక ఆపరేషన్ 'ఆపరేషన్ ఎంటెబ్బే'లో మరణించారు. ఈ ఘటన నెతన్యాహు జీవితం, ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపింది.