మోడీ .. మోడీ నినాదాలతో మారుమోగిన వైట్‌హౌస్, వెల్‌కమ్ బ్యాక్ అన్న జో బైడెన్ (ఫోటోలు)
Siva Kodati |
Published : Jun 22, 2023, 09:43 PM IST
అగ్రరాజ్యంలో తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు , 4 మిలియన్ల మంది భారతీయ అమెరికన్లకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. నాడు వైట్‌హౌస్‌ను బయటి నుంచి చూశానని.. ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికాను సందర్శించానని మోడీ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీకి వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌లు మోడీకి ఎదురొచ్చి స్వాగతం పలికారు.
27
modi
ప్రధానికి గౌరవ సూచికంగా 19 గన్ సెల్యూట్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సమయంలో భారత్, అమెరికా జాతీయ గీతాలను ఆర్మీ బ్యాండ్ ప్లే చేసింది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై బైడెన్, మోడీలు సంతకాలు చేశారు.
37
modi
ఇరు దేశాల రాజ్యాంగం ‘‘మేము, ప్రజలు’’ అనే పదంతో ప్రారంభమవుతుందని మోడీ తెలిపారు. కోవిడ్ అనంతరకాలంలో ప్రపంచ క్రమం కొత్త రూపాన్ని సంతరించుకుందని మోడీ చెప్పారు.
47
modi
భారత్, అమెరికాల బంధం చాలా గొప్పదన్నారు జో బైడెన్. రెండు గొప్ప దేశాలు 21వ శతాబ్ధపు గమనాన్ని నిర్వచించగలరని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.
57
modi
పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు, హెల్త్ కేర్, ఆహార భద్రత వంటి అంశాల్లో భారత్, అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయని జో బైడెన్ తెలిపారు.
67
modi
భారత్ అమెరికాల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి ఉద్దేశించిన రక్షణ సహకారం నుంచి అంతరిక్ష యాత్ర వరకు సంబంధించి భారీ ప్రకటనలు ఈరోజు చేయబడ్డాయి
77
modi
భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను తయారు చేయడానికి భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో జతకట్టినట్లు అమెరికన్ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ అనుబంధ ఏరోస్పేస్ విభాగం ప్రకటించింది.