ఎలా గుర్తిస్తారు.?
అమెరికాలో అక్రమంగా నివనిస్తున్న వారిని గుర్తించే బాధ్యత యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ (ICE) చూసుకుంటుంది. అమెరికా సరిహద్దు భద్రత, జాతీయ భద్రత కాపాడడం ఈ విభాగం ప్రధాన విది. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాడ్ సెక్యూరిటికీ చెందిన ఈ సంస్థ. అక్రమ వలసలను నిరోధించడానికి ఈ సంస్థ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించే బాధ్యతను ఈ సంస్థే చేపడుతోంది. ఇందుకోసం వీళ్లు రకరకలా మార్గాలను ఎంచుకుంటున్నారు.
సరిహద్దుల్లో డ్రోన్లు, రాడార్లు, థర్మల్ కెమెరాల ద్వారా నిరంతర పరిశీలిస్తున్నారు. అదే విధంగా అమెరికాలో ఏదైనా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఈ వెరిఫై సిస్టమ్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇక ఉద్యోగులు పనిచేస్తున్న ప్రదేశాల్లో ICE అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ముఖ్యంగా అనుమానాస్పద సంస్థలపై వీరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి ఉద్యోగం చేస్తున్నవారిని గుర్తిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్లు, హెల్త్ ఇన్షురెన్స్ వంటి వివరాలను పరిశీలిస్తున్నారు.