గంటకు 2 వేల కి.మీల వేగం, ధర రూ. 1000 కోట్లు. భారత్‌కు ట్రంప్‌ ఆఫర్‌ చేసిన ఎఫ్‌ 35 విమానాల్లో ఎన్నో ప్రత్యేకతలు

Published : Feb 14, 2025, 05:07 PM ISTUpdated : Feb 14, 2025, 06:14 PM IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ ఎఫ్‌35 యుద్ధ విమానాలను భారత్‌కు ఆఫర్‌ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకీ విమానాల ప్రత్యేకత ఏంటి? వీటి ఉపయోగం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
గంటకు 2 వేల కి.మీల వేగం, ధర రూ. 1000 కోట్లు. భారత్‌కు ట్రంప్‌ ఆఫర్‌ చేసిన ఎఫ్‌ 35 విమానాల్లో ఎన్నో ప్రత్యేకతలు
F 35 Fighter

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా భారత్‌కు ఎఫ్‌-35 యుద్ధ విమానాలను ఆఫర్‌ చేశారు. ఇప్పుడీ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిది. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫైటర్‌ జెట్స్‌ను అమెరికా తనకు అత్యంత సన్నిహిత దేశాలకు కూడా ఇవ్వడానికి వెనుకడువేస్తోంది. నాటో కూమటి దేశమైన తుర్కియేకు కూడా వీటిని విక్రయించమని అమెరికా గతంలో తేల్చి చెప్పింది. 

24

రష్యాకు చెందిన ఎస్‌ 400ను కొనుగోలు చేసిందన్న కారణంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్‌ కూడా ఈ విమానాలు ఉపయోగిస్తున్నా ఈ ఆధునిక ఫైటర్‌ జెట్‌ను విక్రయిస్తామని అమెరికా ప్రకంటిచడం విశేషం. F-35 యుద్ధవిమానం ప్రపంచంలోనే అత్యాధునిక మల్టీ-రోల్ స్టెల్త్ జెట్‌గా ప్రసిద్ధి చెందింది.

ఇది స్టెల్త్, సూపీరియర్ సెన్సార్స్, నెట్‌వర్కింగ్ సిస్టమ్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల కలయికతో యుద్ధరంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పటి వరకు ఈ యుద్ధ విమానం అమెరికా, యుకే, ఇజ్రాయెల్, జపాన్‌తో పాటు కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడీ జాబితాలో భారత్‌ కూడా వచ్చి చేరింది. 

34

ప్రత్యేకతలు ఏంటంటే.. 

ఈ యుద్ధ విమానంలో ఎఫ్‌ 135 ఇంజన్‌ను ఉపయోగిస్తారు. 40,000 పౌండ్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయడం ఈ విమాన ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ విమానం అత్యధికంగా గంటకు సుమారు 1975 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అలాగే ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల కళ్లుగప్పి ప్రయాణిస్తుంది. ఇది రాడర్లకు కూడా అంత సులభంగా ఈ విమానం అంతు చిక్కదు. కేవలం చిన్న సిగ్నేచర్‌ను మాత్రమే సృష్టిస్తుంది. దీంతో శత్రువుల కంట అంత సులభంగా పడదు. ఈ విమానాన్ని అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌ మరో రెండు సంస్థలతో కలిసి తయారు చేశారు. విమానం లోపల అధునాతన సాంకేతికతను అందించారు. 

ఈ ఫ్లైట్‌ నడిపే పైలెట్‌కు హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్ప్లే  అందిస్తారు. వీటితో వారికి రియల్‌టైమ్‌ ఇన్ఫర్మేషన్‌ లభిస్తుంది. ఒక్క ఈ హెల్మెట్‌ ఖరీదే సుమారు రూ. 34 కోట్లు. దీనిబట్టే ఇందులో ఎంత అధునాతన సాంకేతికతను ఉపయోగించారో అర్థం చేసుకోవచ్చు. ఈ విమానం 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇక ఈ విమాన నిర్వహణ కూడా చాలా ఖరీదైన విషయంగా చెప్పాలి. ఈ విమానం గంటసేపు గాల్లో ఎగిరితే సుమారు 36,000 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 31 లక్షల రూపాయల ఇంధన ఖర్చవుతుంది. అలాగే ఈ విమానాలు నడపాలంటే పైల్స్‌ ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. 
 

44

మొత్తం మూడు వేరియంట్స్‌.. 

ఎఫ్‌-35 స్టెల్త్‌జెట్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో రూపొందించారు. 

* ఇందులో మొదటిది ఎఫ్‌-35 ఎ బేసిక్‌ వేరియంట్‌. దీని ధర మన కరెన్సీలో రూ. 695 కోట్లు. 

* ఇక రెండోది ఎఫ్‌ -35 బి వేరియంట్‌. దీని ధర రూ. 990 కోట్లు. ఈ విమానం ప్రత్యేకత విషయానికొస్తే రన్‌వే లేకపోయినా.. ఈ విమానం నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు, ల్యాండ్ కూడా కాగలదు. 

* మూడో వేరియంట్‌ ఎఫ్‌ 5 సిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం రూపొందించారు. ఇందులో ఎన్నో సెక్యూరిటీ, హైఎండ్‌ టెక్నాలజీ ఫీచర్లను అందించారు. దీని ధర అక్షరాల రూ. 955 కోట్లకు పైమాటే. 
 

Read more Photos on
click me!

Recommended Stories