USA: అమెరికాలో సంవత్సరానికి రెండుసార్లు టైం ఎందుకు మార్చుతున్నారు? అసలీ టైం గోల ఏంటీ?

Published : Jul 15, 2026, 03:43 PM IST

USA: టైం చాలా ముఖ్యం. మనం ఏ పని చేయాలన్నా టైంను బట్టి ఫిక్స్ చేసుకుంటాం. అంతే గానీ మనకోసం టైం మారదు. కానీ ఓ కంట్రీలో మాత్రం పగటి వెలుతురును వృథా చేయకూడదని ఏకంగా గడియారంలో ముళ్లునే మార్చేస్తారంట. ఇంతకీ ఎక్కడో తెలుసా?

PREV
15
కాలం ఎవరి కోసము ఆగదు

కాలం ఎవరి కోసమూ ఆగదు, మన కోసమే టైం మారదు అనుకుంటాం. కానీ అమెరికాలో మాత్రం పగటి వెలుతును వృథా చేయకూడదని ఏకంగా దేశం మొత్తం గడియారాల్లో ముళ్లులనే మార్చేస్తుంది. దీనినే డేలైట్ సేవింగ్ టైం అంటారు. అయితే దశాబ్దాలుగా సాగుతున్న ఈ గడియారాల మార్చే తలనొప్పికి అమెరికా ఇప్పుడు శాశ్వతంగా చెక్ పెట్టబోతోంది.

25
ఇండియాలో ఎందుకు టైం మారదు?

మన దేశంలో గడియారంలో సమయం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. జనవరి అయినా, జూలై అయినా, డిసెంబర్ అయినా ఇండియన్ స్టాండర్డ్ టైం (IST) ప్రకారమే కొనసాగుతుంది. కానీ అమెరికా, కెనడా, యూరప్ లో ఏడాదికి రెండు సార్లు వాచ్ లో టైం మార్చుతూ ఉంటారు. వేసవిలో ఒక గంట ముందుకు..శీతాకాలంలో ఒక గంట వెనక్కి జరుపుతారు. ఈ విధానాన్నే డే లైట్ సేవింగ్ టైం అంటారు.

35
అసలు గడియారం మార్చే పద్ధతి ఏంటి?

భూగోళంపై అమెరికా పైభాగంలో ఉండటం వల్ల అక్కడ కాలాలను బట్టి పగటి సమయంలో చాలా తేడా ఉంటుంది. ఎండాకాలంలో ఉదయం నాలుగున్నరకే ఎండ వచ్చేస్తుంది. రాత్రి 9 వరకూ చీకటి పడదు. వేసవిలో ఉదయం పూట వెలుతురు వేస్ట్ కాకూడదని మార్చి నెలలో గడియారాలను ఒక గంట ముందుకు జరుపుతారు. మళ్లీ నవంబర్ రాగానే ఒక గంట వెనక్కి జరిపి పాత సమయానికి తెస్తారు. భారత్..భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల మనకు పగలు, రాత్రి సమయాల్లో పెద్దగా మార్పులు ఉండవు. అందుకే మన ఇండియాలో ఇలా టైం మార్చాల్సిన అవసరం రాదు.

45
ఇప్పుడు అమెరికా తెస్తున్న కొత్త చట్టం ఏంటి?

ఏడాదికి రెండుసార్లు ఇలా టైం మార్చుకోవడం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిత్ర వేళలు పాడే ఆరోగ్యం దెబ్బతింటోంది. అందుకే అక్కడ దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఈ విధానానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రభుత్వం సన్ షైన్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చింది. దీనికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ సంతకంతో ఇది చట్ట రూపం దాల్చనుంది.

55
దీనివల్ల ఏం మారుతుంది?

ఇకపై అమెరికన్లు ఏడాదికి రెండుసార్లు తమ వాచ్‍లలో సమయాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఏడాది పొడవునా ఒకే సమయం అమల్లో ఉంటుంది. ప్రస్తుతం మార్చి-నవంబర్ మధ్య పాటించే డే లైట్ సేవింగ్ టైంను ఇకపై శాశ్వత ప్రామాణిక సమయంగా మార్చేస్తున్నారు.

మొదటి ప్రపంచ యుద్ధం నాటి చరిత్ర

ఈ విధానం ఈనాటిది కాదు. తొలిసారి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో విద్యుత్‍ను, ఇంధనాన్ని ఆదా చేయడం కోసం అమెరికా ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోనూ దీన్ని వాడారు. చివరకు 1969లో దీనికో చట్టం తెచ్చి అధికారికంగా అమలు చేశారు. నాటి నుంచి నేటి వరకు అమెరికన్లు ఈ తిప్పలు పడుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ కొత్త చట్టంతో దశాబ్దాల నాటి తలనొప్పికి అమెరికా గుడ్ బై చెప్పబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories