గ్రహాంతరవాసులు ఈ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ అంశంపై వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే కథల్లోనే ఉన్న ఈ గ్రహాంతర వాసులు ఇప్పుడు నిజంగానే మనల్ని పలకరించేందుకు వస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు.
న్యూయార్క్ నగరంలో మాన్‌హాటన్ ప్రాంతంతో సమాన పరిమాణంలో ఉన్న ఓ రహస్య వస్తువు అంతరిక్షం నుంచి భూమి వైపు అత్యంత వేగంగ దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఇదోదే సాధారణ గ్రహశకలం లాంటి వస్తువని అంతా భావించారు. కానీ తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
25
సెకనుకు 60 కిలోమీటర్ల వేగం
భూమివైపు దూసుకొస్తున్న ఈ వస్తువు వెడల్పు దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుందని, సెకండుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని అంచనా వేస్తున్నారు. నిజానికి అంతరిక్షం నుంచి ఇలాంటి ఎన్నో గ్రహశకలాలు భూమివైపు వస్తుంటాయి. అయితే భూ వాతావరణంలోకి రాగానే దగ్ధమైపోతాయి. కానీ ప్రస్తుతం వస్తున్న వస్తువు గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.
35
నవంబర్ నాటికి భూమిపైకి
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వచ్చే నవంబర్ నాటికి ఈ వస్తువు భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రహస్య వస్తువుకి 3ఐ/అట్లాస్‌గా పేరు పెట్టారు. ముందు దీన్ని A11PL3Z అని పిలిచేవారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధనలు చేస్తూ ఇది గ్రహాంతర సాంకేతిక పరికరం అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అవీ లోయెబ్ కూడా ఈ పరిశోధనలో భాగమయ్యారు. ఆయన గతంలో 2017లో కనిపించిన ‘ఒవుమువామువా’ అనే అంతరిక్ష వస్తువు కూడా ఇతర గ్రహాల జీవులు సృష్టించిన కృత్రిమ వస్తువే కావచ్చని సూచించారు.
శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం, ఒకవేళ 3ఐ/అట్లాస్ నిజంగా వ్యోమనౌక అయితే, అది మనం గుర్తించే లోపలే దాడి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ వస్తువు ప్రయాణిస్తున్న తీరును గమనిస్తే నవంబరు చివర్లో సూర్యుని దగ్గరగా వెళ్తుందని భావిస్తున్నారు. సూర్యునికి దగ్గరగా వెళ్తే భూమి నుంచి కనిపించే అవకాశం తగ్గిపోతుంది. అంటే అది పూర్తిగా రహస్యంగా భూమి వైపు దూసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. దీన్ని మొదటగా గుర్తించింది చిలీలోని అట్లాస్ సర్వే టెలిస్కోప్.
55
నిజంగా ఢీకొడుతుందా.?
ప్రస్తుతం 3ఐ/అట్లాస్ భూమిని ఢీకొట్టబోతోందని చెప్పడం పూర్తిగా ఖచ్చితమైన సమాచారం కాదు. ఇది కేవలం ఒక సిద్ధాంతాత్మక అంచనా మాత్రమే. అయినప్పటికీ ఈ నివేదికను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇది దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. భూమి రక్షణ కోసం ఇప్పటినుంచే వ్యూహాలు రూపొందించుకోవాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే మన టెక్నాలజీ పరిమితులను బట్టి ఈ ప్రయత్నాలు విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.