ఇండియాలో అత్యంత ధనిక దేవుడు ఎవరు..? భారీ ఆదాయం వస్తున్న దేవాలయాలు ఇవే..?

First Published Aug 11, 2024, 1:34 PM IST

భారత దేశం హిందూ సంసృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు.. ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలుగానిలిచాయి. కాగా అందులో అత్యంత సంపద కలిగి.. ఆదాయం కలిగిన గుళ్లు కూడా ఉన్నాయి. ఇండియాలో అత్యంత ధనిక దేవాలయాల గురించి చూస్తే..? 

రిచ్చెస్ట్ టెంపుల్స్ లిస్ట్ చూస్తే... ముందుగా గుర్తుకు వచ్చేది... తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఆలయం. ఆంధ్రప్రదేశ్‌ లో గల ఈ దేవాలయం  ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన మరియు ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది. తిరుమల కొండల నడుమ 16 ఏకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ గుడి.. 10వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక  ఈ ఆలయంఆదాయం ఏటా 15 00  నుంచి 2 000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచన.. రోజు ఈ ఆలయాన్ని  50,000లకు పైగా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ఇక 3 లక్షల కోట్ల నికర విలువ కలిగిన ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో  ఒకటిగా నిలిచింది. విలువైన  కానుకలు,  భక్తుల నుండి వెంట్రుకలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మొత్తం, వివిధ టిటిడి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలుగా వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంటుంది. 

ఇక ధనిక దేవాలయాల్లో జగన్నాథ పురి ఆలయం  కూడా  ఉంది. ఒడిశాలో ఉన్న ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. దేవాలయానికి వచ్చే ఆదాయంతో పాటుగా ఈమధ్యనే గుడిలో ఉన్న రహస్య గదుల ద్వారా.. అత్యంత విలువైన సంపదను బయటకు తీయ్యడం జరిగింది. అంతే కాదు లోపల తెరవాల్సిన గదులు కూడా ఇంకొన్ని ఉన్నట్టు చెబుతారు. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యకతలు కూడా ఉన్నాయి. నిత్యం వేల మంది దర్శించుకునే ఈ దేవాలయానికి వందల కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. 30 వేల ఎకరాల భూమి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

Latest Videos


ఇక నేల మాళిగల ద్వారా వేల కోట్ల సంపదను కలిగి ఉన్న దేవాలయంగా ప్రసిద్ది చెందింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం దగ్గరలో గల ఈ ఆలయం.. 120,000 కోట్ల ఆస్తులతో  ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా నిలిచింది.  బంగారు విగ్రహాలు, వజ్రాలు ,వెండి,  పచ్చలు, పురాతన వస్తువులు ఇలా వేల కోట్ల సంపద ఈ దేవాలయం నేల మాళిగలో ఉంది. కొంత వరకూ బయటకు తీసినా..ఇంకా కొన్ని గదులు తెరవలేదు. ఆ గదులకు నాగ బంధం ఉండటంతో.. వాటిని తీయడానికి వెనకడుగు వేస్తున్నారు. 
 

ఇక ధనిక దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి. పంజాబ్ రాష్ట్రంలో  అమృత్‌సర్ పట్టనంలో ఉన్న  గోల్డెన్ టెంపుల్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ  దేవాలయాల్లో ఒకటి.  400 కిలోల బంగారంతో ఈ దేవాలయానికి  తాపడం చేయించారు. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ గా పిలుస్తారు. ఈ గుడి వార్షిక ఆదాయం 500 కోట్లకు పైనే ఉంటుందని అంచన.  ఐదవ సిక్కు గురువు గురు అర్జన్ సహాయంతో ఈ మందిరం నిర్మించబడింది. గురునానక్ ఇక్కడ ఆలయం నిర్మించకముందు ద్యానం చేసేవారట. 1581లో నిర్మాణం స్టార్ట్ అయ్యి.. ఎనిమిది ఏళ్ళకు కంప్లీట్ అయ్యిందని చెపుతారు. ప్రారంభమైంది. 

ఇక అందరు భక్తితో కొలిచే షిర్డీ సాయిబాబా వారి ఆలయం కూడా ధనిక ఆలయమే. మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజూ 30,000 మంది వరకూ భక్తులు వస్తుంటారు. 1922 లో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే. సాయిబాబా వారు  కూర్చున్న  సింహాసనం దాదాపు 100  కిలోల బంగారంతో చేయబడిందట. దాదాపు 400 కోట్ల విరాళాలు.. నగదు, చెక్కులు, బంగారం, ఇతర ఆదాయాలు చూసుకుంటే.. 500 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇక  ఆలయ ట్రస్ట్ ద్వారా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.  రెండు ఆసుపత్రులను నిర్వహించడంతో పాటు.. ప్రతిరోజు దాదాపు లక్షమంతి భక్తులకు అన్న ప్రసాదం అందిస్తుంది షిరిడి ట్రస్ట్. 
 

ఇక గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం  కూడా అత్యంత సంపద కలగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటిది ఉద్భవించిన ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది. ఈ ఆలయానికి  ఎంత సంపద ఉంది అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ..ఈ ఆలయానికి 300 కిలోల బంగారం వివిధ రూపాల్లో ఉన్నట్టు సమాచారం.  1700 ఎకరాల భూమితో సహా వివిధ రూపాల్లో  ఆస్తులను కలిగి ఉందట సోమనాథ్ ఆలయం. 
 

వైష్ణో దేవి ఆలయం హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వైష్ణో దేవిగా పూజించబడే దుర్గాదేవికి అంకితం చేయబడింది. 108 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటైన ఈ మందిరానికి గత రెండు దశాబ్దాలలో  1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి మరియు రూ. 2,000 కోట్ల నగదు విరాళాల రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది.  

Siddhi vinayak Temple

ఇక ముంబయ్ లో ఎంతో ఫేమస్ సిద్ధివినాయక దేవాలయం.   రెండు శతాబ్దాల నాటి ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. ఆలయ ప్రధాన మూల విరాట్ కు నాలుగు కిలోల బంగారు నగలు ఉన్నాయి. ఆలయానికి  125 కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రోజువారి ఈ ఆలయానికి 30 లక్షల ఆదాయం వస్తుందట.  ఇక్కడ కొలువైన గణపతి దేవుడు.. విశిష్ట లక్షణం కలిగి ఉంటాడు.. ఇక్కడి వినాయకుడి తొండం కుడి వైపుకు వంగి ఉంటుంది. విగ్రహానికి నాలుగు చేతులు ఉన్నాయి. 

click me!