TGSRTC : భారీగా తగ్గిన బస్సు టికెట్‌ ధరలు.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.

Published : Feb 17, 2025, 02:01 PM IST

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. బస్సు టికెట్‌ ధరలపై డిస్కౌంట్‌ అందిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌ వేదికగా అధికారిక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..   

PREV
13
TGSRTC : భారీగా తగ్గిన బస్సు టికెట్‌ ధరలు.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.
TGSRTC

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పథకం అమల్లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బస్సు టికెట్స్‌పై రాయితీని అందిస్తున్నారు. అయితే ఇది రాష్ట్రమంతా అమల్లోకి రాలేదు. కేవలం ఒక రూట్‌లో మాత్రమే అమలు చేశారు. ఇంతకీ ఏంటా రూట్‌.? ఏమేర ధరలు తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

23
TS RTC MD Sajjannar

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో ఈ డిస్కౌంట్‌ అమల్లోకి తీసుకొచ్చారు. బెంగళూరుకు నడిచే అన్ని సర్వీసులకు ఇది వరిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలకు 10 శాతం డిస్కౌంట్‌ అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. ఈ డిస్కౌంట్‌తో ఒక్కొక్కరికి రూ. 100 నుంచి రూ. 160 వరకు ఆదా అవుతుంది.

హైదరాబాద్‌ నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బెంగళూరుకు వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా శని, ఆదివారాల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఆదివారం నుంచి తిరుగు ప్రయాణం చేసే వారు ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. చాలా మంది బెంగళూరుకు ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్తుంటారు. ఈ పోటీని తట్టుకునే ఉద్దేశంతోనే తెలంగాణ ఆర్టీసీ ఈ డిస్కౌంట్‌ను అందించి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం సంస్థకు ఏమేర లాభం చేకూరుస్తుందో చూడాలి. 
 

33

ఇదిలా ఉంటే బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక మారిన ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 

* ఏసీ స్లీపర్‌ (బెర్త్‌) హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రస్తుత టికెట్‌ ధర రూ. 1569గా ఉండగా డిస్కౌంట్‌ తర్వాత రూ. 1412గా ఉంది. 

* ఇక ఏసీ  స్లీపర్ - సీటర్ టికెట్ ధర రూ.1203 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 1083కి తగ్గింది. 

* రాజధాని బస్సు విషయానికొస్తే ఇంతకు ముందు రూ. 1203గా ఉండగా ప్రస్తుతం డిస్కౌంట్ తర్వాత రూ. 1083కి తగ్గింది. 

* నాన్ ఏసీ స్లీపర్ - సీటర్ టికెట్ ధర రూ.1160 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 1044కి తగ్గింది. 

* నాన్‌ ఏసీ సీటర్‌ విషయానికొస్తే ఇంతకు ముందు రూ. 951గా ఉండగా, డిస్కౌంట్ తర్వాత రూ. 856కి తగ్గింది. 

* అలాగే సూపర్ లగ్జరీ టికెట్‌ ఇంతకు ముందు రూ. 946గా ఉండగా డిస్కౌంట్‌ తర్వాత రూ. 851కి తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 
 

click me!

Recommended Stories