Published : May 13, 2026, 02:41 PM ISTUpdated : May 13, 2026, 02:54 PM IST
Snakes : పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ పాముల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరి తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిస్థితేంటి..? ఇక్కడ ఎన్ని పాములు ఉన్నాయి…? ఆసక్తికరమైన స్టడీ డిటెయిల్స్…
Hyderabad : సాధారణంగా పాములు అనగానే పల్లెటూళ్ళు గుర్తుకువస్తాయి. పొలాలు, దట్టమైన చెట్లు, పొదలతో కూడిన అటవీప్రాంతం పాముల సంచారానికి అనుకూలంగా ఉంటుంది... అందుకే ఇక్కడే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది ఒకప్పటి మాట... ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనుషుల మాదిరిగానే పాములు కూడా పల్లెల నుండి పట్నాలకు షిప్ట్ అవుతున్నట్లున్నాయి... ఓ స్టడీలో ఆసక్తికరమైన విషయాలు బైటపడ్డాయి.
25
పాములకు అడ్డాగా హైదరాబాద్..
హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వరంగ పరిశోధన సంస్థ CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ ఆండ్ మాలిక్యులర్ బయాలజీ), FOSS (ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ) కలిసి పాములపై ప్రత్యేకంగా పరిశోధన చేశాయి. 2013 నుండి 2022 వరకు హైదరాబాద్ నగరంలో పాముల సంఖ్య తగ్గిందా లేక పెరిగిందా..? అన్నది పరిశీలించారు. వీరి పరిశీలనలో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి.
పదేళ్లలో ఈ ఐటీ నగరంలో పాములు భారీగా పెరిగాయని వీరి స్టడీలో తేలింది. హైదరాబాద్ లో ఏటా 8 నుండి 10 శాతం పాముల సంఖ్య పెరిగిందట.. స్నేక్ క్యాచర్స్ కు పట్టుబడుతున్న పాములే ఇందుకు నిదర్శనం. పదేళ్ళలో ఒక్క హైదరాబాద్ లోనే 55,467 పాములను జనావాసాల్లో పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టారట. భయపెట్టే అంశం ఏంటంటే ఇలా రెస్క్యూ చేసిన పాముల్లో అత్యధికం (54 శాతం) విషపూరితమైనమే.
35
హైదరాబాద్ లో కనిపించేవి ఈ పాములే...
హైదరాబాద్ నగరంలో అత్యధికంగా త్రాచుపాములు (Cobra) ఉంటున్నాయట... రెస్క్యూ చేసేవాటిలో 47.5 శాతం ఇవేనని CCMB, FOSS స్టడీ తేల్చింది. ఇక 27 శాతానికి పైగా చెర్రిపోతులు (Rat Snakes) ఉంటున్నాయట. మొత్తంగా చూసుకుంటే 70 శాతంపైగా ఈ రెండు రకాల పాములే... మిగతా పాములు కేవలం 30 శాతం మాత్రమే.
పాములు ఎక్కువగా వర్షాకాలంలోనే కనిపిస్తుంటాయి.. హైదరాబాద్ లో కూడా ఇదే జరుగుతోందట. జూలై నుండి నవంబర్ వరకు పాములు ఎక్కువగా పట్టుబడుతున్నాయి... అక్టోబర్ నెలలో ఇది ఫీక్స్ లో ఉంటుందని FOSS చెబుతోంది. పాముల సంతానోత్పత్తికి ఇది అనుకూలమైన కాలం... అందుకే ఎక్కువగా కనిపిస్తుంటాయని తెలిపారు.
హైదరాబాద్ లో పాములు అత్యధికంగా కనిపించే 232 హాట్ స్పాట్స్ ని CCMB, FOSS స్టడీ గుర్తించింది. ఈ ప్రాంతాలు నగరంలో 6.9 శాతం భూభాగంలో ఉన్నాయట. అయితే బాగా డెవలప్మెంట్ జరిగే ప్రాంతాల్లోనే పాములు ఎక్కువగా ఉంటున్నాయని ఈ స్టడీ తేల్చింది.
ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉంటాయి... అలాగే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక మురుగు కాలువల్లో పారుతుంటుంది. ఇక నిర్మాణ వ్యర్థాలు ఎక్కువ. దీంతో ఎలుకల సంఖ్య పెరుగుతుంది... వీటికోసమే పాములు వస్తుంటాయి. కాబట్టి ప్రజలు అహారం, ఇతర వ్యర్థాలరు ఎక్కడపడితే అక్కడ పారేయకూడదు.
55
పాములతో లాభాలు..
పాముల సంఖ్య పెరగడంతో నష్టాలే కాదు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఎక్కువగా ఉన్న త్రాచుపాములు, జెర్రిగొడ్డులు ఎలుకలను ఎక్కువగా తింటుంటాయి. దీంతో ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో ఎలుకల బెడద ఉండదు. అయితే ఎలుకలకు పట్టుకునేందుకు పాములు ఇంట్లోకి వస్తే మాత్రం ప్రమాదకరం.