విజయ్ - రష్మిక నుంచి విరాట్ - అనుష్క వరకు.. దేశంలో అత్యంత ఖరీదైన 5 పెళ్లిళ్లు

Published : Mar 12, 2026, 08:52 AM IST

భారతదేశంలో సెలబ్రిటీల పెళ్లిళ్లంటే ఆడంబరాలకు, గ్రాండ్ వేడుకలకు కేరాఫ్ అడ్రస్. విజయ్, రష్మిక నుంచి దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ నుంచి ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ వరకు, కోట్లు ఖర్చుపెట్టి జరిగిన కొన్ని అత్యంత ఖరీదైన స్టార్ వెడ్డింగ్స్ ఏవంటే?  

PREV
16
దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిల్లు..

భారతదేశంలో సెలబ్రిటీల పెళ్లిళ్లు చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. విలాసవంతమైన పెళ్లి పందిరులు, ఖరీదైన డిజైనర్ దుస్తులు, భారీగా ఖర్చు చేస్తూ.. వేడుకలతో అదరగొడతారు. తమ పెళ్లిని చిరకాలం గుర్తుండిపోయేలా చేయడానికి ఎందరో స్టార్ కపుల్స్ కొన్ని సంవత్సరాలుగా కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించిన కొన్ని అత్యంత ఖరీదైన సెలబ్రిటీ వివాహాలు ఏవో తెలుసా?

26
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని మహల్ లో రాజసం ఉట్టిపడేలా పెళ్లి  వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుక చాలా గ్రాండ్‌గా, అదే సమయంలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా జరిగింది. లగ్జరీ డెకరేషన్, డిజైనర్ దుస్తులు, ప్యాలెస్ లాంటి  స్టేజ్ తో పాటు  ఈ పెళ్లికి రూ.12 నుంచి 20 కోట్ల వరకు ఖర్చయిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

36
దీపికా పదుకొణె – రణ్‌వీర్ సింగ్

దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ 2018లో ఇటలీలోని అందమైన లేక్ కోమోలో పెళ్లి చేసుకున్నారు. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సుమారు రూ. 70 నుంచి 77 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం. ఈ జంట కొంకణి, సింధీ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇండియాలో బాలీవుడ్ సెలబ్రిటీల కోసం గ్రాండ్ రిసెప్షన్‌లు ఇచ్చారు. 

46
ప్రియాంక చోప్రా – నిక్ జోనస్

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ భారతదేశంలోనే అత్యంత వైభవంగా జరిగిన పెళ్లిళ్లలో ఒకదానికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ జంట 2018లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. పలు వేడుకలు, లగ్జరీ డెకరేషన్, అంతర్జాతీయ అతిథులతో జరిగిన ఈ పెళ్లికి రూ. 60 కోట్లకు పైగా ఖర్చయిందని సమాచారం.

56
కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2021లో రాజస్థాన్‌లోని విలాసవంతమైన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో రాజసం ఉట్టిపడేలా పెళ్లి చేసుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకలో పెళ్లికి ముందు జరిగే ఈవెంట్స్, డిజైనర్ దుస్తులు, కట్టుదిట్టమైన భద్రత ఉన్నాయి. ఈ మొత్తం పెళ్లికి సుమారు రూ. 70 నుంచి 75 కోట్ల వరకు ఖర్చయిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
66
అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల డెస్టినేషన్ వెడ్డింగ్ ఇటలీలోని టస్కనీలో జరిగింది. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ వేడుకను ఓ లగ్జరీ రిసార్ట్‌లో కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే జరిపించారు. ఈ పెళ్లికి సుమారు రూ. 90 నుంచి 100 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం. దీంతో ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సెలబ్రిటీ వివాహాలలో ఒకటిగా నిలిచింది.
Read more Photos on
click me!

Recommended Stories