Hyderabad: రూ. 300 కోట్లు, 6000 ఉద్యోగాలు.. హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ స్థాయి బిస్కెట్ త‌యారీ కంపెనీ

Published : May 02, 2025, 01:38 PM IST

పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో హైద‌రాబాద్ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఐటీ, ఫార్మా రంగాల్లో భారీగా పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తున్న భాగ్య‌న‌గ‌రంలో మ‌రో ప్ర‌పంచ స్థాయి కంపెనీ ఏర్పాటైంది. ప్ర‌ముఖ ఫుడ్ త‌యారీ సంస్థ లోహియా గ్రూప్ త‌న నూత‌న బిస్కెట్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Hyderabad: రూ. 300 కోట్లు, 6000 ఉద్యోగాలు.. హైద‌రాబాద్‌లో ప్ర‌పంచ స్థాయి బిస్కెట్ త‌యారీ కంపెనీ

హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లో లోహియా గ్రూప్‌ తన నూతన బిస్కెట్ ఉత్పత్తి కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ హైటెక్ యూనిట్‌ను 7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ప్రారంభ దశలో నెలకు 1,000 టన్నుల బిస్కెట్లు ఉత్పత్తి చేయనున్న ఈ యూనిట్‌ను త్వరలోనే 5,000 టన్నుల సామర్థ్యం వరకు విస్తరించే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. 

25
Lohia

వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ఫలితంగా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా మొత్తం 6,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బిస్కెట్ల తయారీకి అవ‌స‌ర‌మ‌య్యే మైదా, చక్కెర, బెల్లం, తేనె, పాలు వంటి ముడి పదార్థాలను స్థానికంగా కొనుగోలు చేయ‌నున్న‌ట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.  దీంతో స్థానికంగా ఉన్న రైతులకు, వ్యాపారుల‌కు లాభం చేకురేలా స‌న్నాహాలు చేస్తున్నారు. 

35

అలాగే మహిళల ఆర్థికంగా ఎదుగుదల దృష్టిలో ఉంచుకుని ‘ఉమెన్ ఫస్ట్ ఎంప్లాయిమెంట్ డ్రైవ్‌’ను సంస్థ ప్రారంభించింది. ఇప్పటికే మొత్తం ఉద్యోగులలో 40 శాతానికి పైగా మహిళలే ఉండటం విశేషం. ఉత్పత్తి రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేందుకు సంస్థ కృషి చేస్తోంది. 
 

45

లోహియా కన్ఫెక్షనరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి మాట్లాడుతూ – “ఇటీవల సంవత్సరాల్లో మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధిక నాణ్యత కలిగిన పదార్థాలతో, ఆధునిక బయోటెక్నాలజీ సాయంతో, హైస్పీడ్ ఆటోమేటెడ్ యంత్రాలతో బిస్కెట్లను రూపొందిస్తున్నాం. డిజైన్, టేస్ట్, న్యూట్రిషన్ మూడు కోణాల్లో ఈ ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటాయి” అని తెలిపారు.
 

55

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న లోహియా గ్రూప్‌ త్వరలోనే బిస్కెట్లను విదేశాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories