Hyderabad: హైదరాబాద్‌లో ఇవి చూడకపోతే చాలా మిస్‌ అయినట్లే.. ఒక్కరోజు టూర్‌ ప్యాకేజీ

Published : Feb 22, 2025, 04:27 PM IST

హైదరాబాద్‌ అనగానే ఇక్కడి ఐటీ, ఫార్మా కంపెనీలతో పాటు పర్యాటక ప్రదేశాలు గుర్తొస్తాయి. అయితే వందల ఏళ్ల చరిత్ర ఉన్న భాగ్యనగరంలో కొన్ని అద్భుత ప్యాలెస్‌లు ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు తెలంగాణ టూరిజం మంచి అవకాశాన్ని కల్పించింది. ఇంతకీ ఏంటీ టూర్‌ ప్యాకేజీ ఇందులో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? చూద్దాం..   

PREV
14
Hyderabad: హైదరాబాద్‌లో ఇవి చూడకపోతే చాలా మిస్‌ అయినట్లే.. ఒక్కరోజు టూర్‌ ప్యాకేజీ

హైదరాబాద్‌ ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న నగరం. వందల ఏళ్ల క్రితం ఇక్కడ నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరంగా ఉన్నాయి. అయితే పురాతన నిర్మాణాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే వాటిలో చార్మినార్‌, గోల్కోండ, ట్యాంక్‌బండ్‌ వంటివి మాత్రమే ఉంటాయి. అయితే హైదరాబాద్‌ అద్భుతమైన ప్యాలెస్‌లకు కూడా పెట్టింది పేరు. అలనాటి నిర్మాణశైలి ఉట్టిపడేలా కనిపించే ఎన్నో ప్యాలెస్‌లు ఉన్నాయి. 
 

24
Telangana-tourism

చాలా మందికి హైదరాబాద్‌లో ఇలాంటి ప్యాలెస్‌లు ఉన్నాయన్న విషయం కూడా తెలియదు. భాగ్యనగరంలో ఉన్న ఇలాంటి ప్యాలెస్‌లో చౌహముల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు ప్రధానమైనవి. ఇలా ప్యాలెస్‌లన్నింటినీ ఒకేసారి వీక్షించేందుకు తెలంగాణ టూరిజం మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజామ్‌ ప్యాలేస్‌ టూర్‌ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవలం కొన్ని గంటల్లోనే ఈ ప్యాకేజీని పూర్తి చేయొచ్చు. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

34

కేవలం వీకెండ్స్‌లో మాత్రమే కాకుండా ప్రతీ రోజూ ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంది. మధ్యహ్నం 12 గంటలకు టూర్‌ మొదలవుతుంది. బేగంపేట్‌లోని టూరిజం ప్లాజా నుంచి బస్సు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు తాజ్‌ కృష్ణకు చేరుకుంటుంది. ముందుగా చౌహమల్లా ప్యాలెస్‌ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్‌ను  విజిట్‌ చేస్తారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు టూరిజం ప్లాజా వద్ద డ్రాప్‌ చేస్తారు. దీంతో టూర్‌ ముగుస్తుంది. 
 

44

ప్యాకేజీ ధర ఎంతంటే.. 

టూర్‌ ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 2400గా నిర్ణయించారు. అలాగే చిన్నారులకు అయితే రూ. 1920గా ఉంది. ఇది నాన్‌ ఏసీ ప్రయాణానికి మాత్రమే. ఏసీ బస్సు కావాలనుకుంటే వేరే ఛార్జీలు ఉంటాయి. ఇక భోజనం ప్యాకేజీలో కవర్‌ అవుతుందా లేదా అన్న విషయాన్ని వెబ్‌సైట్‌లో పేర్కొనలేదు. ఇందుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పూర్తి వివరాలు, టికెట్‌ బుకింగ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 
 

click me!

Recommended Stories