Taj Banjara: ఈ హోటల్లో ఒక్క రాత్రి ఉండాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా.?

Published : Feb 21, 2025, 02:18 PM ISTUpdated : Feb 21, 2025, 03:12 PM IST

తాజ్‌ హోటల్స్.. లగ్జరీకి పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఈ హోటల్స్ సేవలందిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ తాజ్‌ పలు బ్రాంచ్‌లను రన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బంజారాహిల్స్‌లోని తాజ్‌ బంజారాను జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు సీజ్‌ చేశారు. ఇంతకీ ఈ హోటల్‌ను ఎందుకు సీజ్‌ చేశారు.? ఇందులో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి.? లాంటి వివరాలు తెలుసుకుందాం..   

PREV
13
Taj Banjara: ఈ హోటల్లో ఒక్క రాత్రి ఉండాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా.?

హైదరాబాద్‌లో ఉన్న టాప్‌ లగ్జరీ హోటల్స్‌లో ఒకటైన తాజ్‌ బంజారకు జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు షాక్‌ ఇచ్చారు. పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న కారణంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హోటల్ మొత్తాన్నీ సీజ్ చేశారు. గత రెండేళ్లుగా తాజ్‌ బంజారా హోటల్‌ యాజమాన్యం ట్యాక్స్‌లు చెల్లిండచం లేదని అందుకే సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 

23

ఇప్పటి వరకు ఈ హోటల్‌ యాజమాన్యం రూ. 1.4 కోట్ల బకాయి పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. పన్నులకు సంబంధించి ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపించామని, అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే అధికారులు ఈ హోటల్‌ను ఏడాదిన్నర క్రితమే డీఫాల్టర్‌ల జాబితాలోనూ చేర్చారు. అయినా హోటల్‌ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం. 

ఇదిలా ఉంటే హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ రూ. 2000 కోట్ల పన్నులను రాబట్టాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కూడా కేవలం రూ. 1450 కోట్లు మాత్రమే వసూళు అయ్యాయి. ఈ నేపథ్యంలో పన్ను చెల్లించని వారిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగానే తాజ్‌ బంజారాపై చర్యలకు ఉపక్రమించారు. 

33

అంత ఆదాయం వచ్చే హోటల్‌ పన్నులు చెల్లించకపోవడం ఏంటి.? 

ఇదిలా ఉంటే దేశంలో అత్యంత లగ్జరీ హోటల్స్‌లో ఒకటి, అందులోనూ నగరం నడి బొడ్డున ఉండే తాజ్‌ హోటల్‌ పన్నులు చెల్లించకపోవడం ఏంటనే ప్రశ్న వస్తోంది. విదేశీ పర్యటకులు, రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో నిత్యం బిజీగా ఉండే తాజ్‌ హోటల్‌ పన్నులు ఎందుకు చెల్లించడం లేదనే సందేహం రావడం సర్వసాధారణం. అయితే దీనిపై తాజ్‌ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ధరలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

కాగా హైదరాబాద్‌లో ఉన్న కాస్లీ హోటల్స్‌లో తాజ్‌ బంజారా ఒకటి. ఈ హోటల్‌లో ఒక రోజు స్టే చేయాలంటే కనీసం రూ. 10 వేలు చెల్లించాల్సిందే. ఇంకాస్త లగ్జీ రూమ్స్‌ కావాలంటే రూ. 20 నుంచి రూ. 30 వేల వరకు ఉంటుంది. ఇక తాజ్‌ గ్రూప్‌లో కొన్ని హోటల్స్‌లో అయితే ప్రెసిడెంట్ సూట్స్‌ పేరుతో రూమ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిలో ఒక్క రాత్రి స్టే చేయాలంటే ఏకంగా రూ. 90 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ధరకు అనుగుణంగానే ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. మినీ బార్‌ మొదలు స్విమ్మింగ్ పూల్‌, కాన్ఫరెన్స్ హాల్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే అదో కొత్త ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అయితే ఇంతలా ధరలు వసూలు చేస్తున్న హోటల్స్‌ పన్ను చెల్లించని కారణంగా సీజ్‌ అవ్వడమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

click me!

Recommended Stories