పట్టణీకరణ పెరుగుతోంది. దీంతో ఒకప్పుడు అడవుల్లా ఉన్న ప్రాంతాలు కూడా ఇప్పుడు నగరంగా మారిపోతున్నాయి. దీంతో అప్పటి వరకు అక్కడ నివసించిన వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారుల్లో ఈ సమస్య ఎక్కువవుతోంది.
ఈ కారణంగానే తరచూ పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది భయపడడమో, లేదా పాములను చంపడమే చేస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ. వీరికి ఒక్క కాల్ చేస్తే చాలు పాములను ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తారు.