మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. మీ ముఖం చెబుతుంది..!

First Published Jul 13, 2021, 11:00 AM IST

మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా.. అనారోగ్యంతో ఉంటే.. ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇది కాకుండా.. మనం ముఖం చూసి.. ఎలా ఉంటే.. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో చెప్పేయవచ్చట.

మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. లేదా.. ఎంత అనారోగ్యంగా ఉన్నారనే విషయం మీరు ఎలా తెలుసుకుంటారు..? కేవలం మీ ముఖాన్ని చూసి.. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చెప్పేయవచ్చట. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా.. అనారోగ్యంతో ఉంటే.. ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇది కాకుండా.. మనం ముఖం చూసి.. ఎలా ఉంటే.. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో చెప్పేయవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
కళ్లు పసుపు రంగులో ఉంటే..మీ కళ్లు, ముఖం పసుపు రంగులోకి మారితే.. మీకు జాండీస్ సోకినట్లు అర్థం. మీ శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు.. ఎర్ర రక్త కరణాలు చీలిపోయినప్పుడు ముఖం, కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయట. దీని వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు కాలేయం, బ్లాడర్ సమస్యలు, కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
undefined
కనుబొమ్మలు, కనురెప్పలు రాలిపోతే...తలలో వెంట్రుకలు ఊడిపోవడం చాలా సహజం. అలా కాకుండా.. కనుబొమ్మలు, కనురెప్పలు ఊడిపోవడం లాంటివి జరిగితే మాత్రం మీరు ఆరోగ్యంగా లేరని అర్థం. జుట్టు కుప్పలు కుప్పలుగా ఊడుతుంటే.. మీరు అలోపేసియా అరేటాతో బాధపడుతున్నారని అర్థం. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉందని దాని అర్థమట. అలాంటి సమయంలో జుట్టు ఊడిపోతుందట. కాబట్టి.. వెంటనే వైద్యులను సంప్రదించి సరైన మందులు వాడాలి.
undefined
కళ్లు వాచినట్లుగా కనపడుతోందా..?కళ్లు ఉబ్బినట్లుగా కనపడితే.. సరిపడ నిద్ర లేదని అర్థం. ఎక్కువగా ఉప్పు తింటున్నా కూడా అా జరుగుతుంది. హార్మోన్ల లో మార్పులు, వృద్ధాప్యం, అలెర్జీ ఈ కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుంది.
undefined
ముఖంపై అవాంఛిత వెంట్రుకలు..చాలా మహిళలు అవాంఛిత వెంట్రుకల సమస్యతో బాధపడుతుంటారు. ఇది పీసీఓఎస్( పాలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్యతో బాధపడుతున్నారని అర్థం.
undefined
పెదాలు పగిలి రక్తం కారడం..చాలా మందికి ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా ఎదురౌతూ ఉంటుంది. డీ హైడ్రేషన్, ఏదైనా మెడిసిన్ రియాక్షన్ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు.
undefined
పుట్టుమచ్చలు.. ఇవి మీకు పుట్టుకుతోనే వస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ.. మీరు పెరుగుతున్నకొద్దీ అవి పెరగడం .. వాటి రంగు మారడం.. సైజ్ మారడం లాంటివి జరిగితే మాత్రం.. డాక్టర్లను సంప్రదించాలి. ఇది క్యాన్సర్ కి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది.
undefined
ముఖం పై నల్ల మచ్చలు.. చాలా మందికి ముఖంపై నల్ల పొడ, తెల్ల పొడ లాంటివి కనపడతాయి. ఇవి హార్మోనల్లో మార్పుల కారణం గా వస్తుంటాయి. డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
undefined
click me!