అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్ర:
2014 సెప్టెంబరు 27న UN జనరల్ అసెంబ్లీ (UNGA)లో తన ప్రసంగంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి మొదటిసారిగా ప్రతిపాదించారు. డిసెంబర్ 11, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం లేదా ప్రపంచ యోగా దినోత్సవంగా దీనిని పిలుస్తున్నాం.
2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.